న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్‌లో భారత్‌ ఆడాలి.. జూన్‌ వరకు బీసీసీఐ నిర్ణయం కోసం వేచి చూస్తాం: పాక్‌

Asia Cup in Pakistan: PCB to wait for BCCI confirmation till June 2020

కరాచీ: పాకిస్తాన్‌లో వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగబోయే ఆసియా కప్‌లో భారత్‌ ఆడాలి. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ వరకు సమయం ఉన్నా.. జూన్‌ లోపే బీసీసీఐ తన నిర్ణయం వెల్లడించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సీఈఓ వసీం ఖాన్‌ కోరాడు. 26/11 దాడుల తర్వాత పాకిస్తాన్‌తో ద్వైపాకిక్ష సిరీస్‌లను భారత్‌ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.

మహిళా స్ప్రింటర్‌ సంచలం.. జమైకా చిరుత ఉసేన్‌ బోల్ట్‌ రికార్డు బ్రేక్‌మహిళా స్ప్రింటర్‌ సంచలం.. జమైకా చిరుత ఉసేన్‌ బోల్ట్‌ రికార్డు బ్రేక్‌

ఇక 2009లో పాక్‌ పర్యటన సందర్భంగా.. శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో ఆరుగురు లంక ఆటగాళ్లు గాయపడగా.. ఆరుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఈ ఉగ్రదాడి తర్వాత ఆ దేశంలో పర్యటించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావడం లేదు. అయితే పాక్ చేసేందేంలేక తటస్థ వేదికల్లో ఇన్ని రోజులు మ్యాచ్‌లను నిర్వహించింది. అయితే ఎట్టకేకలకు శ్రీలంక జట్టు సాహసం చేసి తాజాగా పాక్ పర్యటనకు వెళ్ళింది. దీంతో పాక్ క్రికెట్‌ పునర్వైభవానికి పీసీబీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. మరిన్ని జట్లు రావాలని కోరుకుంటోంది.

ఈ క్రమంలోనే పాకిస్తాన్‌లో వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగబోయే ఆసియా కప్‌పై పాక్ బోర్డు ఎన్నో ఆశలు పెట్టుకుంది. తాజాగా వసీం ఖాన్‌ మాట్లాడుతూ... 'ఆసియా కప్ కోసం పాకిస్తాన్ రావడానికి భారత్ అంగీకరిస్తుందో లేదో చూడాలి. ఈ టోర్నీలో భారత్‌ పాల్గొంటే విజయవంతం అవుతుందనుకుంటున్నా. భారత్‌ మద్దతు లేకుండా ఈ టోర్నీ విజయవంతం కాదు. ఆసియా కప్‌లో భారత్‌ ఆడాలని కోరుకుంటున్నా' అని పేర్కొన్నారు.

'వచ్చే ఏడాది సెప్టెంబర్‌ వరకు సమయం ఉన్నా.. జూన్‌ లోపే బీసీసీఐ తన నిర్ణయం వెల్లడించాలి. అప్పటివరకు బీసీసీఐ నిర్ణయం కోసం వేచి చూస్తాం. ఆసియా కప్‌ భారత్‌లో నిర్వహించినా.. పాక్‌ రావడానికి సిద్దంగా ఉంది. ఈ టోర్నీలో ఎలాగైనా భారత్‌ ఆడాలి. ఆసియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌, ఐసీసీలదే తుది నిర్ణయం. భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ల పునరుద్దరణకు పాక్‌ ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. తటస్థ వేదకల్లోనైనా భారత్‌తో మ్యాచ్ ఆడటానికి మాకు ఎలాంటి సమస్యలు లేవు' అని వసీం ఖాన్‌ చెప్పాడు.

Story first published: Monday, September 30, 2019, 17:05 [IST]
Other articles published on Sep 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X