న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంత్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై స్పందించిన గంగూలీ

Asia Cup 2018: Sourav Ganguly is surprised over non-selection of a youngster

న్యూ ఢిల్లీ: మరి కొద్ది నిమిషాల్లో ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా.. హాంకాంగ్ జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో బరిలోకి దిగనున్న 16 మంది జట్టులోనూ రిషబ్ పంత్ లేకపోవడం పట్ల టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అసలే టీమిండియాకు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కోసం నానా తంటాలు పడుతుంటే ఈ ఎంపిక జరిగిన విధానం పట్ల గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో రిషబ్ పంత్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు.

జట్టు ఎంపిక విషయం పట్ల గంగూలీ

జట్టు ఎంపిక విషయం పట్ల గంగూలీ

టెస్టు సిరీస్‌లో భాగంగా ఆడిన చివరి మ్యాచ్‌లో రాహుల్‌తో కలిసి సెంచరీల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 464 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు రాహుల్‌తో కలిసి తీవ్రంగా శ్రమించాడు. అలాంటిది 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆడలేడా అని గంగూలీ ప్రశ్నిస్తున్నాడు. ప్రస్తుత జట్టు ఎంపిక విషయం పట్ల గంగూలీ ఓ నిర్దారణకు వచ్చాడు.

వచ్చే ఏడాదైనా అంతర్జాతీయ స్థాయిలో

వచ్చే ఏడాదైనా అంతర్జాతీయ స్థాయిలో

అదేంటంటే ఇంగ్లాండ్ చివరి టెస్టు ముగియక ముందే ఆసియా కప్‌లో ఆడాల్సిన భారత జట్టును ముందుగానే ఎంపిక చేసేసిందని ఖరారైయ్యాడు. ఈ క్రమంలో 20 ఏళ్ల యువ సంచలనం రిషబ్ పంత్.. వచ్చే ఏడాది అయినా అంతర్జాతీయ స్థాయిలో అవకాశం వస్తే కచ్చితంగా తన ప్రతిభను నిరూపిస్తాడనే నమ్మకాన్ని వ్యక్తపరిచాడు. ఈ సందర్భంగా టీమిండియా ఎంపిక విధానం పట్ల గంగూలీ ఇలా మాట్లాడాడు.

జట్టు ఎంపిక రిషబ్ పంత్ సెంచరీ కొట్టకముందే

జట్టు ఎంపిక రిషబ్ పంత్ సెంచరీ కొట్టకముందే

'ఆసియా కప్‌కు టీమిండియా ఎంపికను చూసి ఆశ్చర్యానికి గురైయ్యాను. జట్టు ఎంపిక రిషబ్ పంత్ సెంచరీ కొట్టకముందే సిద్ధమైపోయిందనుకున్నాను. ఓవల్ స్టేడియంలో అతను చేసిన సెంచరీకి తాను వన్డే ఫార్మాట్ లో చక్కటి ప్రదర్శన చేయగలడని భావిస్తున్నాను.'అని ముగించాడు.

ఇంగ్లాండ్‌ వన్డేలలో రాణించలేకపోయిన ధోనీ

ఇంగ్లాండ్‌ వన్డేలలో రాణించలేకపోయిన ధోనీ

మరో పక్క మహేంద్ర సింగ్ ధోనీ గురించి మాట్లాడుతూ..'ఈ టోర్నమెంట్ ధోనీ కెరీర్‌లో చాలా ముఖ్యమైన సిరీస్. ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లలో అంతగా తన సత్తా నిరూపించుకోలేకపోయిన ధోనీ ఈ మ్యాచ్‌లలో కచ్చితంగా ఆడి తీరాలి. స్కోరు బోర్డును వేగంగా పరుగులెత్తించాలి. అతను వన్డే ఫార్మాట్‌లో ఆడటం పట్ల ఇప్పటికే పలువురు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పేలా అతని ప్రదర్శన ఉండాలి' అని మాజీ కెప్టెన్ తెలిపాడు.

Story first published: Tuesday, September 18, 2018, 16:17 [IST]
Other articles published on Sep 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X