న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జాదవ్‌‌ని నిర్లక్ష్యం చేసి భారీ మూల్యం చెల్లించుకున్నాం: పాక్ కెప్టెన్

Asia Cup 2018: Ind vs Pak | Sarfraz Ahmed Admits Team Stumped By Kedar Jadhav
 Asia Cup 2018: Prepared for Kuldeep Yadav, Yuzvendra Chahal, but Kedar Jadhav got to us: Sarfraz Ahmed

హైదరాబాద్: టీమిండియా ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌‌ని నిర్లక్ష్యం చేసి తాము భారీ మూల్యం చెల్లించుకున్నామని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆసియా కప్‌లో భాగంగా బుధవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 ఓవర్లు బౌలింగ్ చేసిన కేదార్ జాదవ్ 23 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

స్పోర్ట్స్ అవార్డులు 2018: కోహ్లీకి ఖేల్ రత్న, సిక్కీ రెడ్డికి అర్జున అవార్డుస్పోర్ట్స్ అవార్డులు 2018: కోహ్లీకి ఖేల్ రత్న, సిక్కీ రెడ్డికి అర్జున అవార్డు

ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ హార్దిక్ పాండ్యా గాయపడటం, అనంతరం మైదానం వీడటంతో ప్రత్యామ్నాయంగా కేదార్ జాదవ్‌తో కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ చేయించిన సంగతి తెలిసిందే. తనకు అందివచ్చిన అవకాశాన్ని కేదార్ జాదవ్ చక్కగా వినియోగించుకున్నాడు. సరైన సమయంలో వికెట్లు తీసి భారత జట్టు విజయంలో కీలకపాత్ర వ్యవహారించాడు.

దీంతో మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ "స్పిన్నర్లు కుల్దీప్, చాహల్‌ల బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు మేము ప్రాక్టీస్ చేశాం. కానీ.. కేదార్ జాదవ్‌ బౌలింగ్‌ని పసిగట్టలేక వికెట్లు సమర్పించుకున్నాం. జట్టులో బాబర్ అజామ్ మినహా అందరూ చెత్త షాట్లు ఆడే వికెట్లు చేజార్చుకున్నారు" అని చెప్పాడు.

1
44050

"తొలి ఐదు ఓవర్లలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినా.. మధ్యలో పుంజుకునే అవకాశం మాకు దక్కింది. అయితే, ఈ సమయంలో కేదార్ జాదవ్ పాక్‌ని దెబ్బతీశాడు. ఏది ఏమైనా టోర్నీ ఆరంభంలోనే ఈ ఓటమి మా జట్టుకి ఓ హెచ్చరిక. తప్పిదాలు పున‌రావృతం కాకుండా జాగ్రత్తపడతాం" అని సర్ఫరాజ్ తెలిపాడు.

సెప్టెంబరు 23న భారత్xపాక్ మ్యాచ్, పూర్తి షెడ్యూల్ వివరాలుసెప్టెంబరు 23న భారత్xపాక్ మ్యాచ్, పూర్తి షెడ్యూల్ వివరాలు

మంగళవారం దుబాయి ఇంటర్నేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగడంతో పాకిస్థాన్ 162 పరుగులకే కుప్పకూలింది. పాకిస్థాన్ నిర్దేశించిన 163 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా 29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు భారత బౌలర్లలో భువనేశ్వర్ (3/15), కేదార్ జాదవ్ (3/23), బుమ్రా (2/23) విజృంభించడంతో 43.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. తాజా విజయంతో టోర్నీ సూపర్-4లోకి ప్రవేశించిన భారత్ జట్టు తర్వాత మ్యాచ్ శుక్రవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

Story first published: Thursday, September 20, 2018, 19:09 [IST]
Other articles published on Sep 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X