న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్‌: పాక్‌తో పోలిస్తే భారత జట్టే నా ఫేవరేట్

By Nageshwara Rao
Asia Cup 2018 : Tanwir Afzal Talks About Team India
Asia Cup 2018: Hong Kong All-Rounder Tanwir Afzal Picks India As Favourites Over Pakistan

హైదరాబాద్: ఆసియా కప్‌లో ఎన్ని మ్యాచ్‌లు జరిగినా... అందరి దృష్టి మాత్రం భారత్-పాక్‌ మ్యాచ్‌ మీదే ఉంటుందని హాంకాంగ్‌‌ ఆల్‌రౌండర్‌ తన్వీర్‌ అఫ్జల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెప్టెంబర్ 15 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియాకప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఆసియాకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా గురువారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి హాంకాంగ్ సైతం ఆసియా కప్‌లో ఆడేందుకు బెర్తు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆసియాకప్ గురించి హాంకాంగ్‌‌ ఆల్‌రౌండర్‌ తన్వీర్‌ అఫ్జల్‌ మీడియాతో మాట్లాడాడు.

భారత్‌ ఎప్పుడూ మెరుగైన ప్రదర్శనే చేసింది

భారత్‌ ఎప్పుడూ మెరుగైన ప్రదర్శనే చేసింది

తన్వీర్ మాట్లాడుతూ "అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో నాకు తెలిసినంత వరకూ భారత్‌ ఎప్పుడూ మెరుగైన ప్రదర్శనే చేసింది. వ్యక్తిగత ప్రతిభను నిరూపించుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో ఆడే మ్యాచ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. భారత్‌ ఆటగాళ్లు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు. ఇలాంటి ప్రదర్శనే ఆసియాకప్‌లోనూ ప్రదర్శిస్తారనుకుంటున్నా" అని అన్నాడు.

అందరి దృష్టి మాత్రం భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌‌పైనే

అందరి దృష్టి మాత్రం భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌‌పైనే

"యూఏఈ వేదికగా ఎన్ని మ్యాచ్‌లు ఆడినా అందరి దృష్టి మాత్రం భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌‌పైనే ఉంటుంది. ఇరు జట్లలో అద్భుత ప్రదర్శన చేసే ఆటగాళ్లున్నారు. ఆసియా కప్ జరుగుతున్న యూఏఈలో స్పిన్లర్లకు బాగా కలిసి వస్తుంది. భారత్‌ ప్రతి పరిస్థితినీ తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. ఇరు జట్లలో నాకు భారత్‌ జట్టంటేనే ఇష్టం" అని చెప్పుకొచ్చాడు.

నా మద్దతు టీమిండియాకే

నా మద్దతు టీమిండియాకే

"భారత్‌ ఆటగాళ్లలో ఉన్నత స్థాయి బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాలున్నాయి. అందుకే ఆ జట్టుకు నా మద్దతిస్తాను. నా ఫేవరెట్‌ జట్టు కూడా అదే. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఆసియా కప్‌లో ఆడక పోవడం కాస్త బాధగా ఉంది. జట్టులో అతడు లేడు కాబట్టి, ఆ ప్రభావం ప్రతి మ్యాచ్‌లోనూ కచ్చితంగా కనిపిస్తుంది. కోహ్లీనే ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌" అని తన్వీర్ తెలిపాడు.

కోహ్లీ నుంచి ఎంతో నేర్చుకున్నా

కోహ్లీ నుంచి ఎంతో నేర్చుకున్నా

"కోహ్లీ క్రీజులో ఉన్నప్పుడు ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్లకు ధీటుగా బదులిస్తాడు. కోహ్లీ నుంచి ఎంతో నేర్చుకున్నా" అని తన్వీర్ చెప్పాడు. వర్క్‌లోడ్, రాబోయే సిరిస్‌లను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి సెలక్టర్ల కమిటీ ఆసియాకప్‌ నుంచి విశ్రాంతినిచ్చింది. దీంతో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను ఎంపిక చేయగా, శిఖర్‌ ధావన్‌కు వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలను అప్పగించారు.

Story first published: Saturday, September 8, 2018, 11:47 [IST]
Other articles published on Sep 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X