న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియాకప్ ఫైనల్లో భారత్ Vs బంగ్లా: టీమిండియా ఏడోసారి సాధించేనా?

Asia Cup 2018 : India vs Bangladesh Match Preview & Timings
 Asia Cup 2018 Final Preview: Favourites India to face injury-stricken Bangladesh in summit clash

హైదరాబాద్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ చివరిదశకు చేరుకుంది. మొత్తం ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో చివరకు రెండు జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. దుబాయి వేదికగా శుక్రవారం జరిగే ఫైనల్లో భారత్-బంగ్లాదేశ్‌ జట్లు తలపడనున్నాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 37 పరుగుల తేడాతో విజయం సాధించి ఆసియా కప్‌ ఫైనల్‌కు చేరుకుంది.

<strong>ఫిట్‌నెస్ పరీక్షకు సిద్ధం: విండిస్ పర్యటనకు ముందు యో-యో టెస్టుకు కోహ్లీ</strong>ఫిట్‌నెస్ పరీక్షకు సిద్ధం: విండిస్ పర్యటనకు ముందు యో-యో టెస్టుకు కోహ్లీ

ఓ మాదిరి లక్ష్యాన్ని చేధించే క్రమంలో పాక్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. 240 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారీ అంచనాల మధ్య ఈ టోర్నీ బరిలోకి దిగిన పాక్ జట్టు సూపర్-4 దశలోనే చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించగా... పసికూన అప్ఘన్ జట్టు అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది.

మొత్తం 6 జట్లతో ప్రారంభమైన ఆసియా కప్ టోర్నీలో చివరకు రెండు జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. శ్రీలంక, హాంకాంగ్ జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించగా... పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ జట్లు సూపర్-4లో నిష్క్రమించాయి. టోర్నీ ఆరంభం నుంచి హాంకాంగ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను ఓడించిన టీమిండియా ఫైనల్‌కు సిద్ధమైంది.

1
44058
అసాధారణ ఆటతో ఏకంగా ఫైనల్లోకి

అసాధారణ ఆటతో ఏకంగా ఫైనల్లోకి

మరోవైపు బంగ్లాదేశ్ జట్టు టోర్నీలో ఎప్పటికప్పుడు తన ప్రదర్శనని మెరుగుపర్చుకుంటూ అసాధారణ ఆటతో ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్లో భారత్‌పై గెలిచిన రికార్డు బంగ్లాదేశ్‌కి లేకపోవడం విశేషం. కొలంబో వేదికగా ఈ ఏడాది మార్చి 18న జరిగిన నిదాహాస్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌-బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి.

4 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా

4 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా

ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ వరకూ బంగ్లాదేశ్ జట్టుదే ఆధిపత్యం కాగా, ఆఖరి బంతికి దినేశ్ కార్తీక్ సిక్స్ బాది భారత్‌కి విజయాన్ని అందించాడు. 2016లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో తలపడిన భారత్-బంగ్లాదేశ్‌లు మరోసారి టైటిల్ కోసం పోటీపడుతున్నాయి.

2016 ఆసియా కప్ ఫైనల్లో కూడా

2016 ఆసియా కప్ ఫైనల్లో కూడా

ఢాకా వేదికగా 2016లో జరిగిన ఆసియాకప్ ఫైనల్లోనూ భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. మొట్టమొదటిసారి టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్‌ను నిర్వహించారు. వర్షం కారణంగా మ్యాచ్‌ని కుదించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది.

శుక్రవారం గెలిస్తే ఏడోసారి ఛాంపియన్‌గా భారత్

శుక్రవారం గెలిస్తే ఏడోసారి ఛాంపియన్‌గా భారత్

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 13.5 ఓవర్లలోనే 122/2తో ఛేదించింది. కాగా, వన్డేల్లో భారత్-బంగ్లాదేశ్‌ జట్లు ఇప్పటివరకు 34సార్లు తలపడగా... టీమిండియా 28సార్లు బంగ్లాదేశ్‌పై విజయం సాధించిగా, బంగ్లాదేశ్ 5 సార్లు... ఓ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. శుక్రవారం నాటి మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే ఏడోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంటుంది.

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ టైమింగ్

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ టైమింగ్

తేదీ: Friday (September 28)

వేదిక: Dubai - Dubai International Cricket Stadium, Dubai, United Arab Emirates.

టైమింగ్స్: 5:00 PM (IST) Channel: Star Sports Network; India Matches on DD National

లైవ్ స్ట్రీమింగ్: HotStar.com

Match Starts at 5:00 PM

జట్ల వివరాలు:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేష్ కార్తీక్, ఎంఎస్ ధోనీ, మనీష్ పాండే, కేదార్ జాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ కౌల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, రవీంద్ర జడేజా, దీపక్ చహర్.

బంగ్లాదేశ్:

మోర్టజా (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, తమమ్ ఇక్బాల్, మొహమ్మద్ మిథున్, లిటోన్ కుమార్ దాస్, ముష్ఫిఖర్ రహిమ్, అరిఫుల్ హాక్, మహ్ముదుల్లా, హుస్సేన్, నజ్ముల్ హుస్సేన్, మేహిదీ హాసన్, నజ్ముల్ ఇస్లాం, రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజర్ రెహ్మాన్, అబూ హైదర్ రానీ.

Story first published: Thursday, September 27, 2018, 17:48 [IST]
Other articles published on Sep 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X