న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'భారత్‌తో ఆడే ప్రతి మ్యాచ్ పాకిస్థాన్‌కు కీలకమైనదే'

Asia Cup 2018: Every match against India is important, says Pakistan skipper Sarfraz Ahmed

న్యూ ఢిల్లీ: భారత్‌‌పై ఆడే ప్రతి మ్యాచ్‌ పాకిస్థాన్ జట్టుకి కీలకమేనని ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు. యూఏఈ వేదికగా ఈనెల 15 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుండగా.. భారత్, పాకిస్థాన్ మధ్య 19న మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే యూఏఈకి చేరుకున్న పాకిస్థాన్ టీమ్ ప్రాక్టీస్ మొదలెట్టేయగా.. ఇంగ్లాండ్ పర్యటనని టీమిండియా మంగళవారంతో ముగించనుంది.

పాకిస్థాన్ 16న, భారత్ 18న తొలి మ్యాచ్‌ను

పాకిస్థాన్ 16న, భారత్ 18న తొలి మ్యాచ్‌ను

ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్ 16న, భారత్ 18న తమ తొలి మ్యాచ్‌ను హాంకాంగ్‌ జట్టుతో ఆడనున్నాయి. టోర్నీ ఆరంభంలోనే జట్టు లయ అందుకోవడం చాలా ముఖ్యమని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించాడు. గతేడాది ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇలానే భారత్‌తో ఫైనల్‌కి ముందు దక్షిణాఫ్రికా, శ్రీలంకపై గెలిచి టీమ్ మంచి టచ్‌లో ఉందని పేర్కొన్నాడు.

 హాంకాంగ్‌తో జరిగే తొలి మ్యాచ్‌లోనే పాక్

హాంకాంగ్‌తో జరిగే తొలి మ్యాచ్‌లోనే పాక్

'ఆసియా కప్‌లో కూడా హాంకాంగ్‌తో జరిగే తొలి మ్యాచ్‌లోనే పాక్ ఘన విజయం సాధించాలని ఆశిస్తున్నా. అలా మొదటి మ్యాచ్‌లోనే మేము గెలవగలిగితే.. భారత్‌తో జరిగే రెండో మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. భారత్‌తో జరిగే ప్రతి మ్యాచ్‌ పాకిస్థాన్‌కి కీలకమే' అని సర్ఫరాజ్ అహ్మద్ తెలిపాడు.

 త్వరలో పాకిస్థాన్‌తో జరగనున్న టెస్టు సిరిస్‌లోకి

త్వరలో పాకిస్థాన్‌తో జరగనున్న టెస్టు సిరిస్‌లోకి

ఈ సిరీస్ తర్వాత పాకిస్థాన్‌తో ఆడేందుకు తమ జట్టు సిద్ధమని క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన ప్రకటన చేసింది. త్వరలో పాకిస్థాన్‌తో జరగనున్న టెస్టు సిరిస్‌లోకి ఐదుగురు కొత్త వారికి సెలక్టర్లు చోటు కల్పించారు. ఈ ఏడాది సఫారీ గడ్డపై జరిగిన బాల్ టాంపరింగ్ ఉదంతం క్రికెట్ ఆస్ట్రేలియా చరిత్రను మసకబారేలా చేసింది. దీంతో, పాకిస్థాన్‌తో యూఏఈ వేదికగా జరగనున్న టెస్టు సిరిస్‌కు కొత్తవారికి చోటు కల్పించారు.

ఖాళీగా ఉన్న ఆస్ట్రేలియా టాపార్డర్‌ 3 స్థానాలు:

ఖాళీగా ఉన్న ఆస్ట్రేలియా టాపార్డర్‌ 3 స్థానాలు:

పాక్‌తో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్న ఐదుగురిలో మైకేల్ నెసెర్, బ్రెండన్ డాగ్గెట్, మార్మస్ లుబుఛేంజ్, ట్రావిడ్ హెడ్, ఆరోన్ ఫించ్‌లు ఉన్నారు. యూఏఈ వేదికగా ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లపై నిషేధం ఉండటంతో ఆస్ట్రేలియా టాపార్డర్‌లో మూడు స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. ఈ మూడు స్థానాల్లో ఒకదానిని మ్యాట్ రెన్‌షా‌ భర్తీ చేయనున్నాడు.

Story first published: Tuesday, September 11, 2018, 16:03 [IST]
Other articles published on Sep 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X