న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్: భారత్-పాక్ మ్యాచ్‌లో గుర్తించని విషయాలు మీకోసం

Asia Cup, 2018: 4 unnoticed things from the India-Pakistan game

హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది భారత జట్టు. మంగళవారం దుబాయి ఇంటర్నేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగడంతో పాకిస్థాన్ 162 పరుగులకే కుప్పకూలింది.

<strong>భారత్‌కి గాయాల బెడద..: జట్టు మేనేజ్‌మెంట్ ఏం చేస్తోంది?, విమర్శలు</strong>భారత్‌కి గాయాల బెడద..: జట్టు మేనేజ్‌మెంట్ ఏం చేస్తోంది?, విమర్శలు

పాకిస్థాన్ నిర్దేశించిన 163 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా 29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌కు ముందు కీలక పోరులో భారత్‌ నెగ్గుతుందా? లేదా అన్న సందేహాం భారత అభిమానుల్లో నెలకొంది. అయితే, మంగళవారం నాటి మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శన చూసి ఫిదా అయ్యారు.

భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీతో రాణించగా, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (46) పరుగులతో తృటిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు(31 నాటౌట్), దినేశ్ కార్తీక్ (31 నాటౌట్) పరుగులతో భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

1
44050

అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు భారత బౌలర్లలో భువనేశ్వర్ (3/15), కేదార్ జాదవ్ (3/23), బుమ్రా (2/23) విజృంభించడంతో 43.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. తాజా విజయంతో టోర్నీ సూపర్-4లోకి ప్రవేశించిన భారత్ జట్టు తర్వాత మ్యాచ్ శుక్రవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో నమోదైన కొన్ని ఆసక్తికర విషయాలు పాఠకుల కోసం:

గతేడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై సెంచరీ

గతేడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై సెంచరీ

సాధించిన పాక్ విజయంలో కీలకపాత్ర్ పోషించిన ఫకార్ జమాన్ ఈ మ్యాచ్‌లో డకౌటయ్యాడు. జింబాబ్వేతో హారారే క్లబ్ స్టేడియంలో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన ఫకార్ జమాన్ ఈ మ్యాచ్‌లో తొమ్మిది బంతులను ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఐదో ఓవర్‌లో ఫుల్ షాట్‌ను ఆడే క్రమంలో ఫకార్ జమాన్ (0) చాహల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. వన్డేల్లో ఫకార్ జమాన్ డకౌట్ అవడం ఇదే తొలిసారి.

భువనేశ్వర్ కుమార్ సూపర్ బౌలింగ్

భువనేశ్వర్ కుమార్ సూపర్ బౌలింగ్

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ మ్యాచ్ ఆరంభంలోనే జూలు విదిల్చాడు. తన అద్భుతమైన బౌలింగ్‌తో భువనేశ్వర్ (3/15) పాక్‌ను దెబ్బ కొట్టాడు. మూడో ఓవర్ తొలి బంతిని బయటకు వచ్చే ఆడే ప్రయత్నంలో ఓపెనర్ ఇమామ్‌ ఉల్‌ హక్‌ (2)ను, ఫకార్‌ జమాన్ (0)ను భువనేశ్వర్‌ తన వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చాడు. కేవలం 15 పరుగుల వ్యవధిలోనే భువీ పాక్ ఓపెనర్లను పెవిలియన్‌కు చేర్చాడు. డెత్ ఓవర్లలో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన భువీ హాసన్ అలీ వికెట్ తీయడంతో ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఆసియా కప్ టోర్నీలో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన భువనేశ్వర్ వికెట్ తీయకున్నా 50 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

మనీష్ పాండే సూపర్ క్యాచ్

మనీష్ పాండే సూపర్ క్యాచ్

పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్‌ మనీష్‌ పాండే అద్భుత క్యాచ్‌తో ఔరా అనిపించాడు. గాయపడ్డ పాండ్యా స్థానంలో ఫీల్డింగ్‌కు వచ్చిన మనీష్ పాండే ఓ స్టన్నింగ్ క్యాచ్‌ పట్టాడు. కేదార్ జాదవ్ వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్‌లో సర్ఫరాజ్ అహ్మద్ భారీ షాట్‌కు ప్రయత్నించారు. వైడ్ లాంగ్ ఆఫ్ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన పాండే.. బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న మనీష్‌ పాండే పరుగెత్తుకుంటూ వచ్చి అద్భుతంగా బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్‌ కోల్పోతున్నట్లు భావించిన పాండే బంతిని గాల్లోకి విసిరేసి బౌండరీ లైన్‌ను దాటి వచ్చి క్యాచ్‌ అందుకున్నాడు. అత్యంత కష్టమైన క్యాచ్ పాండే పట్టిన తీరు ప్రేక్షకుల్ని అలరించింది. దీంతో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌ (6) పరుగుల వద్ద పెవిలియన్‌‌కు చేరాడు.

ఓపెనర్‌గా రోహిత్ శర్మ 100వ ఇన్నింగ్స్

ఓపెనర్‌గా రోహిత్ శర్మ 100వ ఇన్నింగ్స్

ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. మంగళవారం దుబాయి వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మకు ఇది 294వ మ్యాచ్ కావడం. అంతేకాదు ఓపెనర్‌గా రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ 100వ ఇన్నింగ్స్ కావడం విశేషం. తన 294వ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 294వ సిక్సుని బాదాడు. మంగళవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ మూడు సిక్సులు బాదడం ద్వారా ఈ మైలురాయిని అందుకున్నాడు.

Story first published: Thursday, September 20, 2018, 18:46 [IST]
Other articles published on Sep 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X