క్రికెట్‌ కా భీష్మ్‌పితామహ ఎవరో తెలుసా?: సెహ్వాగ్ ట్వీట్ ఇదే

Posted By:

హైదరాబాద్: ఏప్రిల్‌ 29.. అంతర్జాతీయ డ్యాన్స్ డే. అంతేకాదు శనివారం టీమిండియా వెటరన్ పేసర్ ఆశీష్ నెహ్రా పుట్టినరోజు కూడా. ఆశిష్ నెహ్రా శనివారం తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. నెహ్రా పుట్టినరోజుని పురస్కరించుకుని పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు.

ఎప్పటిలాగే టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్‌ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. 'వావ్‌ నెహ్రాజీ పుట్టినరోజు. ప్రపంచ డ్యాన్స్ డే కూడా ఈరోజే. హ్యాపీ ఏప్రిల్‌ వాలా బర్త్‌డే నెహ్రా జీ. నీతో ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయని తెలియజేస్తూ.. హ్యాష్‌టాగ్‌తో క్రికెట్‌ కా భీష్మ్‌పితామహ' అంటూ ట్వీట్ చేశాడు.

 Ashish Nehra

దీంతో పాటు నెహ్రా బిలియర్డ్స్‌ ఆడుతుండగా పక్కన తను (సెహ్వాగ్) ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ పదో సీజన్‌లో ఆశిష్ నెహ్రా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

Story first published: Saturday, April 29, 2017, 21:35 [IST]
Other articles published on Apr 29, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి