మరో 159 పరుగులు.. వివ్‌ రిచర్డ్స్‌ 43 ఏళ్ల రికార్డుకు స్మిత్ ఎసరు!!

లండన్: బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురై యాషెస్‌ సిరీస్‌లో పురాగమనం చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి టెస్టులో రెండు శతకాలు.. రెండో టెస్టులో అర్ధ సెంచరీ చేసిన స్మిత్‌.. నాలుగో టెస్టులో ఇంగ్లీష్ బౌలర్లపై మళ్లీ విరుచుకుపడి డబుల్‌ సెంచరీ (211)తో మెరిశాడు. దీంతో స్మిత్ అనేక రికార్డులు బద్దలు కొట్టాడు.

62 బంతుల్లో 116 పరుగులు: క్రిస్‌గేల్ మెరుపు సెంచరీ.. అయినా ఓడిన జమైకా!! (వీడియో)

రిచర్డ్స్‌@1

రిచర్డ్స్‌@1

ఈ క్రమంలో స్టీవ్‌ స్మిత్‌ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఒకే సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ రికార్డు సృష్టించాడు. 1976లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతడు 829 పరుగులు చేసాడు. అయితే అనారోగ్య కారణంతో ఐదో టెస్టు మ్యాచులో ఆడలేదు. గత 43 ఏళ్ల నుండి ఈ అత్యధిక పరుగుల రికార్డు రిచర్డ్స్‌ పేరిటే కొనసాగుతోంది.

మరో 159 పరుగులు:

మరో 159 పరుగులు:

రిచర్డ్స్‌ పేరిట ఉన్న 43 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టడానికి స్టీవ్ స్మిత్‌ (671)కు మరో 159 పరుగులు కావాలి. ఐదో టెస్టులో స్మిత్ 159 పరుగులు చేస్తే.. రిచర్డ్స్‌ రికార్డు బద్దలవనుంది. ప్రస్తుతం ఈ జాబితాలో రిచర్డ్స్‌ అగ్రస్థానంలో ఉండగా.. సునిల్‌ గవాస్కర్‌ 774 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. గ్రాహమ్‌ గూచ్‌ (752), బ్రియన్‌ లారా (688) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

కోహ్లీ రికార్డు బ్రేక్‌:

కోహ్లీ రికార్డు బ్రేక్‌:

ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో మూడు మ్యాచులు ఆడిన స్మిత్ 134.20 సగటుతో 671 పరుగులు చేశాడు. మూడు టెస్టుల సిరీస్‌ కానీ, మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత కానీ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్‌ మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ (610)తో పాటు పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు మహ్మద్‌ యూసఫ్‌ (665) రికార్డును బ్రేక్‌ చేశాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ గ్రాహం గూచ్‌ ( 752), వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు బ్రియన్‌ లారా(688) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

భారత్-ఏ జట్టులో ముగ్గురు తెలుగమ్మాయిలకు చోటు.. వైస్ కెప్టెన్‌గా మేఘన!!

గురువారం నుంచి చివరి టెస్టు:

గురువారం నుంచి చివరి టెస్టు:

యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టు రెండు ఇన‍్నింగ్స్‌ల్లో స్మిత్‌ 144 పరుగులు, 142 పరుగులు చేసాడు. ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌కు గాయం కారణంగా దూరమయ్యాడు. మూడో టెస్టులో స్మిత్‌ ఆడలేదు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులు సాధించాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై ఆసీస్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది. గురువారం నుంచి చివరి టెస్టు ప్రారంభం కానుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, September 11, 2019, 13:35 [IST]
Other articles published on Sep 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X