న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మిత్‌ను ఎగతాళి చేసిన ఇంగ్లీషు అభిమానులపై ఐసీసీ సెటైరికల్ ట్వీట్

Ashes: ICCs Karma tweet is an attempt to hit back at England fans for trolling Steve Smith

హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌లో భాగంగా ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించిన అనంతరం ఐసీసీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది. ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

అంతేకాదు యాషెస్ ట్రోఫీని సైతం తిరిగి సొంతం చేసుకుంది. బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత ఈ యాషెస్ సిరిస్‌తో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన స్టీవ్ స్మిత్‌ను ఇంగ్లాండ్ అభిమానులు ఎగతాళి చేసిన సంగతి తెలిసిందే. ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో వరుసగా స్మిత్ రెండు సెంచరీలు సాధించాడు.

స్పిన్‌తో తిప్పేసిన రషీద్: బంగ్లాతో ఏకైక టెస్టులో ఆప్ఘన్ భారీ విజయంస్పిన్‌తో తిప్పేసిన రషీద్: బంగ్లాతో ఏకైక టెస్టులో ఆప్ఘన్ భారీ విజయం

సెంచరీలు సాధించినప్పటీకీ స్టీవ్ స్మిత్‌ను అభినందించాల్సింది పోయి చీటర్ చీటర్ అంటూ అవమానకర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో ఇంగ్లాండ్ అభిమానుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అయితే నాలుగో టెస్టులో స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

తనను ఇంగ్లాండ్ అభిమానులు వెక్కిరిస్తున్నా... మాటలతో గేలిచేసినా... వారికి తన బ్యాట్‌తోనూ సమాధానం చెప్పి యాషెస్ ట్రోఫీని ఆతిథ్య జట్టుకు దూరం చేశాడు. ఈ క్రమంలో ఐసీసీ స్మిత్‌ను ఎగతాళి చేసిన ఇంగ్లాండ్ అభిమానులను ఉద్దేశించి ఓ ఆసక్తికర ట్వీట్ పోస్టు చేసింది.

భారత పర్యటనలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్భారత పర్యటనలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్

అందులో స్మిత్‌ మాస్క్ ధరించిన ఓ ఇంగ్లండ్ అభిమానికి ఫొటోని ట్వీట్ చేసిన ఐసీసీ ''కర్మ... కర్మ అర్థం.. మనుషులు చేసి పనుల వల్ల దక్కే ప్రతిఫలం'' అంటూ కర్మ అర్థాన్ని ఐసీసీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ట్వీట్‌కు ఓ నెజిటన్ 'ఐసీసీ ట్విట్టర్ అకౌంట్ కానీ హ్యాక్ అయిందా?' అంటూ కామెంట్ పెట్టాడు.

Story first published: Monday, September 9, 2019, 18:50 [IST]
Other articles published on Sep 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X