న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టిమ్ టాస్ నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది: రికీ పాంటింగ్

Ashes 2019: Ricky Ponting surprised with Australias decision to bowl 1st at The Oval

హైదరాబాద్: ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టులో టాస్ గెలిచిన టిమ్ పైన్ ఫీల్డింగ్ ఎంచుకోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఈ సిరిస్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహారిస్తోన్న రికీ పాంటింగ్ అన్నాడు. గురువారం ప్రారంభమైన ఐదో టెస్టులో టాస్ గెలిచిన టిమ్ పైన్ ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

దీనిపై రికీ పాంటింగ్ మాట్లాడుతూ "ఆట ముగిసే వరకు నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించను. ఎందుకంటే అది సరైన నిర్ణయమా లేదా తప్పు నిర్ణయామ అని అప్పుడే నిర్ధారించలేం. అది గేమ్ ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను అనుకుంటున్నాను. లంచ్ విరామం అనంతరం టిమ్ పైన్కొంచెం తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు" అని అన్నాడు.

"వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో జో రూట్, బర్న్స్ ఇద్దరూ 80కిపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్‌గా ఒక్కో సమయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది" అని పాంటింగ్ వెల్లడించాడు. ఈ సందర్భంగా ఆఖరి టెస్టులో టిమ్ పైన్ టాస్ గెలిచిన తర్వాత ఏం జరిగిందో పాంటింగ్ వివరించాడు.

టాస్ నెగ్గిన టిమ్

టాస్ నెగ్గిన టిమ్

"మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ టిమ్ వైపు చూస్తూ 'టిమ్, నువ్వు టాస్ నెగ్గావ్' అని చెప్పడాన్ని జట్టులోని పలువురు ఆటగాళ్ల పక్కనే నుంచుని చూశాను. ఆ సమయంలో 'నేను కుర్రాళ్లతో మనం బ్యాటింగ్ ఎంచుకుంటున్నాం' అని చెప్పాను. అయితే, టిమ్ పైన్ మాత్రం బౌలింగ్ ఎంచుకున్నాడు. అప్పుడే నాకు ఆసక్తిగా అనిపించింది" అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

తోలిరోజు చెత్త ఫీల్డింగ్

తోలిరోజు చెత్త ఫీల్డింగ్

తొలిరోజు ఆస్ట్రేలియా ఫీల్డింగ్ మరీ చెత్తగా ఉంది. జోరూట్ బ్యాటింగ్ చేసే సమయంలో మూడు క్యాచ్‌లను నేలపాలు చేశారు. అయితే, జో రూట్ హాఫ్ సెంచరీ అనంతరం పెవిలియన్‌కు చేరడం ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది. దీనిపై పాంటింగ్ మాట్లాడుతూ రూట్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ని సిడిల్ జారవిడిచాడని అన్నాడు.

లంచ్ విరామం తర్వాత

లంచ్ విరామం తర్వాత

అయితే, లంచ్ విరామం అనంతరం ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ మార్ష్ విజృంభించాడ. దీంతో తొలిరోజు ఇంగ్లాండ్ తడబడింది. మిచెల్‌ మార్ష్‌ (4/35) విజృంభించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 271/8 స్కోరు చేసింది. 205 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టుని బట్లర్‌ (64 బ్యాటింగ్‌) ఆదుకున్నాడు.

ఆదుకున్న జోస్ బట్లర్

ఆదుకున్న జోస్ బట్లర్

జోఫ్రా ఆర్చర్‌ (9)తో ఎనిమిదో వికెట్‌కు 21 పరుగులు, లీచ్‌ (10 నాటౌట్‌)తో తొమ్మిదో వికెట్‌కు 45 పరుగులు జోడించాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 27 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయినా.. బర్న్స్‌ (47), రూట్‌ (57) రాణించడంతో 103/1తో మెరుగ్గా కనిపించింది. లంచ్ తర్వాత మార్ష్‌తో పాటు కమిన్స్‌ (2/73), హాజిల్‌వుడ్‌ (2/76) రాణించడంతో ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది.

Story first published: Friday, September 13, 2019, 15:26 [IST]
Other articles published on Sep 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X