న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్చర్‌పై జాత్యాంకర దాడి: వెల్లింగ్టన్ టెస్ట్‌కు సెక్యూరిటీ పెంపు, విలిమయ్సన్ క్షమాపణ

Kane Williamson Apologises To Jofra Archer For Skintone Bias Incident || Oneindia Telugu
Jofra Archer racial abuse: New Zealand heighten security for Wellington Test; Kane Williamson apologises

హైదరాబాద్: మౌంట్ మాంగని వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ జాత్యాంకార దాడిగి గురయ్యాడు. ఈ నేపథ్యంలో వెల్లింగ్టన్ వేదికగా జరిగే రెండో టెస్టుకు సెక్యూరిటీని మరింతగా పెంచాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆదేశించింది.

అసలేం జరిగింది?
మొదటి టెస్టు ముగింపు రోజున గ్యాలరీని ఓ ప్రేక్షకుడు తన పట్ల జాత్యాంకర వ్యాఖ్యలు చేసినట్లు జోఫ్రా ఆర్చర్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. దీంతో జోఫ్రా ఆర్చర్‌కు క్షమాపణ చెప్పిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అనంతరం దర్యాప్తుకు ఆదేశించింది. ఈ టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 65 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సీసీటీవీ పుటేజిన ఆధారంగా

సీసీటీవీ పుటేజిన ఆధారంగా నిందితుడిని గుర్తించి పోలీసులకు అప్పజెప్తామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత సోమవారం జోఫ్రా ఆర్చర్ తన ట్విట్టర్‌లో "నా టీమ్‌ని గెలిపించడానికి పోరాడుతున్న సమయంలో జాత్యాంకార వ్యాఖ్యలను వినడం కొంచెం కలవరపెడుతోంది. ఈ వారంలో ప్రేక్షకులు అద్భుతంగా ఉన్నారు, ఒక్క ఆ వ్యక్తి తప్ప" అని ట్వీట్ చేశాడు.

తన చర్మ రంగుపై వ్యాఖ్యలు

తన చర్మ రంగుపై వ్యాఖ్యలు

మ్యాచ్ అనంతరం ఈఎస్పీఎన్ క్రిక్‌ఇన్ఫోకి ఇచ్చిన ఇంటర్యూలో జోఫ్రా ఆర్చర్ తాను ఔటై పెవిలియన్‌కు వెళుతున్న సమయంలో న్యూజిలాండ్ ప్రేక్షకుల్లో ఒక వ్యక్తి తన చర్మ రంగు గురించి వ్యాఖ్యలు చేసినట్లు తెలిపాడు. ఈ సంఘటన బే ఓవల్‌లో జరిగిన తొలి టెస్టు ఫలితాన్ని కనుమరుగయ్యేలా చేసింది.

కేన్ విలియమ్సన్ క్షమాపణలు

కేన్ విలియమ్సన్ క్షమాపణలు

ఈ సంఘటనపై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సైతం క్షమాపణలు చెప్పాడు. విలియమ్సన్ మాట్లాడుతూ జాత్యాంకార వ్యాఖ్యలు కివీస్‌గా మనం ఉన్న ప్రతిదానికీ వ్యతిరేకంగా చూపుతాయని అన్నాడు. ఇదొక భయంకరమైన విషయమని, ఒక దేశంలో అది కూడా చాలా సాంస్కృతికంగా ఉన్న నేపధ్యంలో ఈ తరహా వ్యాఖ్యలు బాధాకరమని అన్నాడు.

భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు

భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు

భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని విలియమ్సన్ తెలిపాడు. దీనిపై మనం ఏమైనా ప్రభావం చూపిస్తే అది ఎంతమాత్రం మంచిది కాదని విలియమ్సన్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి హామిల్టన్‌ వేదికగా జరిగే రెండో టెస్టులో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కివీస్ బోర్డు నిర్ణయించింది.

ఆటగాళ్ళు చుట్టూ భద్రతను పెంచుతాం

ఆటగాళ్ళు చుట్టూ భద్రతను పెంచుతాం

"మేము ఆటగాళ్ళు ఉన్న ప్రాంతాల దగ్గర భద్రతను పెంచుతాం. ప్రత్యేకించి వారు మైదానం లోపల మరియు వెలుపలకు వస్తున్నప్పుడు. అయితే, ఆటగాళ్ళు సరిహద్దులో ఉన్నప్పుడు మాత్రం చాలా కష్టం. సెల్ఫ్ పోలీసింగ్ కూడా జరుగుతోందని నేను అనుకుంటున్నాను. మన సమాజంలో ఈ రకమైన ప్రవర్తనను మనం అంగీకరించకూడదు" అని కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ అన్నారు.

Story first published: Tuesday, November 26, 2019, 13:00 [IST]
Other articles published on Nov 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X