వైరల్ అవుతున్న కోహ్లీ అనుష్క ఫోటోలివే

Posted By:
Anushka Sharma And Virat Kohli's Kissing Picture Is Something You Can't Afford To Miss

హైదరాబాద్: భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. లంకలో జరుగుతోన్న ముక్కోణపు సిరీస్‌ నుంచి బీసీసీఐ కోహ్లీతో పలువురు ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతున్నాడు. ప్రతి నిమిషాన్ని పండగ వాతావరణంగా గడుపుతూ.. తన సంతోషాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు.

💑

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Mar 11, 2018 at 5:38am PDT

సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చలాకీగా ఉండే కోహ్లీ, అనుష్క తాజాగా కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. భర్తపై తనకున్న ప్రేమను తెలియజేస్తూ కోహ్లీకి ముద్దు పెడుతున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకుంది 'లవ్లీ కపుల్‌, ఈ రోజు ఇంటర్నెట్‌లో బెస్ట్‌ పిక్చర్‌ ఇదే, మిమ్మల్ని చూస్తే అసూయగా ఉంది, క్యూట్‌ కపుల్‌' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అలాగే కోహ్లీ కూడా తన భార్య అనుష్కతో దిగిన ఓ ఫొటోను ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ రెండు ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో షూటింగ్‌ ముగించుకుని ముంబైకి తిరిగొచ్చిన అనుష్కను రిసీవ్‌ చేసుకునేందుకు స్వయంగా కోహ్లీనే ఎయిర్‌పోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆ ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో అభిమానుల్ని అలరించాయి.

Story first published: Monday, March 12, 2018, 13:11 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి