న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనా ప్రభావం.. కోహ్లీకి హెయిర్‌స్టైలిస్ట్‌గా మారిన బాలీవుడ్‌ బ్యూటీ (వీడియో)!!

Anushka Sharma Turns Hairstylist For Virat Ko

ముంబై: ప్రపంచం మొత్తం ప్రస్తుతం మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19)తో పోరాడుతోంది. సుమారు 190 దేశాలు ఈ ప్రాణాంతక వైరస్‌తో అల్లాడిపోతున్నాయి. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 27 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. సుమారు ఆరు లక్షల మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం మధ్యాహ్యానికి 906కి చేరుకోగా.. 20 మంది చనిపోయారు. దీంతో ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్​డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

భారత క్రికెటర్లకి దొరికిన విశ్రాంతి మంచిదే.. ఎందుకంటే?!!భారత క్రికెటర్లకి దొరికిన విశ్రాంతి మంచిదే.. ఎందుకంటే?!!

హెయిర్‌స్టైలిస్ట్‌గా మారిన అనుష్క:

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా క్రికెటర్లంతా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన స్టార్ దంపతులు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే బయట నిత్యావసర దుకాణాలు మినహా మిగతావన్నీ మూసివేయడంతో విరాట్‌కు హెయిర్‌స్టైలిస్ట్‌ ఎవరూ దొరకలేదు. దీంతో విరాట్ హెయిర్ కట్ బాధ్యతని అనుష్క తీసుకుంది. ఓ కత్తెర పట్టుకుని కోహ్లీ హెయిర్‌ స్టైల్‌ సెట్‌ చేసింది.

నా భార్య చేసిన అందమైన హెయిర్​కట్:

నా భార్య చేసిన అందమైన హెయిర్​కట్:

హెయిర్‌స్టైలిస్ట్‌గా మారిన ఈ వీడియోను అనుష్క శర్మ తన ఇన్​స్టాగ్రామ్​లో శుక్రవారం పోస్ట్ చేసింది. క్వారంటైన్​లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని అని విరాట్ కోహ్లీఅనగా.. వెనకనే ఉన్న అనుష్క నవ్వింది. 'నా భార్య చేసిన అందమైన హెయిర్​కట్' అని కోహ్లీ అనడంతో వీడియో ముగిసింది. ​హెయిర్‌ కట్‌కు ముందు, తర్వాత కోహ్లీ ఎలా ఉన్నాడో తెలిపే ఫొటోలు వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోకు పెద్ద సంఖ్యలో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. అనుష్క చేసిన హెయిర్‌స్టైల్‌ చూడ్డానికి బాగుందని అభిమానులు మెచ్చుకుంటున్నారు.

ఇది మామూలు యుద్ధం కాదు:

ఇది మామూలు యుద్ధం కాదు:

మంగళవారం రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లాక్‌డౌన్ ప్రకటించగానే మద్దతు తెలిపిన కోహ్లీ.. దేశ ప్రజలు కూడా ఇంట్లోనే ఉండాలని సూచించాడు. కానీ.. కొంత మంది ఇంటి వెలుపలికి వస్తుండటాన్ని వీడియోల్లో చూసిన కోహ్లీ.. శుక్రవారం సీరియస్‌ అయ్యాడు. కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొవాలంటే లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని కోహ్లీ అన్నాడు. కరోనాపై యుద్ధం సాధారణ విషయం కాదని, ప్రతి ఒక్కరు ప్రభుత్వ సూచనలు పాటించాలని దేశ ప్రజలకు విరాట్‌ సందేశమిచ్చాడు.

70 శతకాలు:

70 శతకాలు:

భారత్‌ తరఫున విరాట్‌ కోహ్లీ 86 టెస్టులు, 248 వన్డేలు, 81 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 7,240, వన్డేల్లో 11,867, టీ20ల్లో 2,794 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 70 శతకాలు సాధించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును బద్దలు కొట్టగల సామర్థ్యం ఒక్క కోహ్లీకి మాత్రమే ఉందని ఇప్పటికే ఎందరో మాజీలు చూపిన విషయం తెలిసిందే. ఇప్పటికే కోహ్లీ ఎందరో దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టాడు.

Story first published: Saturday, March 28, 2020, 15:09 [IST]
Other articles published on Mar 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X