న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అత్యుత్తమ బౌలింగ్ ఎటాక్‌తో భారత పర్యటనకు విండిస్: కోహ్లీసేన నిలబడేనా?

Analysis: West Indies bowling attack best this year; should Kohli team india be worried?

హైదరాబాద్: ఆసియా కప్ విజయం తర్వాత టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది. స్వదేశంలో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా వెస్టిండిస్ జట్టుతో తలపడనుంది. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండగా... జాసన్ హోల్డర్ నాయకత్వంలోని వెస్టిండిస్ జట్టు 8వ స్థానంలో కొనసాగుతోంది.

ఈ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ టీమిండియాకు పెద్ద సవాల్ కాకపోయినప్పటికీ, సొంతగడ్డపై తన జైత్రయాత్రను కొనసాగించాలని ఊవిళ్లూరుతోంది. గత కొన్నేళ్లుగా టెస్టు క్రికెట్‌లో వెస్టిండిస్ రికార్డు మరీ పేలవంగా ఉంది. ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి వెస్టిండీస్‌ టెస్టు రికార్డు దారుణంగా ఉంది.

బీసీసీఐ Vs ఎస్‌సీఏ: పిచ్‌ తయారీలో క్యూరేటర్ల వివాదం, అసలేం జరిగింది?బీసీసీఐ Vs ఎస్‌సీఏ: పిచ్‌ తయారీలో క్యూరేటర్ల వివాదం, అసలేం జరిగింది?

ఈ పద్దెనిమిదేళ్లలో భారత్‌తో ఇంటా బయటా ఏడు సిరీస్‌ల్లో తలపడింది. 2001-02లో మాత్రమే అదీ సొంతగడ్డపై 2-1తో నెగ్గింది. తర్వాతి ఆరు సిరీస్‌లను ఒక్క విజయం లేకుండానే కోల్పోయింది. చివరిసారిగా రెండేళ్ల క్రితం తమ దగ్గరే జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో 0-2తో ఓడింది.

ఇందులో ఒకటి ఇన్నింగ్స్‌ ఓటమి కాగా మరోక దాంట్లో ఏకంగా 237 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇందులో ఒక్క టెస్టును మాత్రమే డ్రా చేసుకుంది. ప్రస్తుత సిరిస్‌లో సైతం వెస్టిండిస్ గొప్పగా రాణించే అవకాశాలు కనిపించడం లేదు. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వెస్టిండిస్ అద్భుతమైన బౌలింగ్‌తో భారత పర్యటనకు వచ్చింది.

1
44264

టీమిండియా సైతం వెస్టిండిస్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల కోసం బౌన్సీ పిచ్‌లను రూపొందిస్తోంది. వెస్టిండిస్‌తో సిరిస్ అనంతరం కోహ్లీసేన ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండిస్ సిరీస్‌నే దీనికి సన్నాహాకంగా వాడుకోవాలని భారత జట్టు మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లుగా తెలిసింది.

బలవంతంగా పడకగదికి తీసుకెళ్లి రేప్ చేశాడు: రొనాల్డోపై మాజీ మోడల్బలవంతంగా పడకగదికి తీసుకెళ్లి రేప్ చేశాడు: రొనాల్డోపై మాజీ మోడల్

ఆసీస్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని పేస్‌ పిచ్‌లు సిద్ధం చేయమని క్యురేటర్లకు భారత జట్టు యాజమాన్యం నుంచి ఆదేశాలు వెళ్లాయి. బౌన్సీ పిచ్‌లపై వెస్టిండిస్ బౌలర్లను కోహ్లీసేన సమర్ధవంతగా ఎదుర్కొంటుదా లేదా తెలియాలంటే మరో రెండు రోజులు వేచిచూడాల్సిందే.

యువ క్రికెటర్లపైనే దృష్టంతా

యువ క్రికెటర్లపైనే దృష్టంతా

ఇంగ్లీషు గడ్డపై ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఓడిపోయి విమర్శలెదుర్కొన్న కోహ్లీ సేన ఈ సిరిస్‌తో తిరిగి గాడిలో పడాలని భావిస్తోంది. తొలిసారిగా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న మయాంక్ అగర్వాల్‌, పృథ్వీ షాలతో పాటు ఇటీవలే టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆంధ్ర కుర్రాడు హనుమ విహారీ, రిషబ్ పంత్‌‌‌‌లకు ఈ సిరిస్ ఎంతో కీలకం కానుంది. విండిస్ రెండు టెస్టు మ్యాచ్‌‌ల సిరిస్ కోసం ఎంపిక చేసిన జట్టులో అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో జట్టు పటిష్టంగా ఉంది.

పటిష్టంగా భారత బ్యాటింగ్ లైనప్

పటిష్టంగా భారత బ్యాటింగ్ లైనప్

బ్యాట్స్‌మెన్ విభాగంలో విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి చోటు దక్కించుకోగా.... స్పిన్ బౌలర్ల విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ఎంపికయ్యారు. షమీ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ భారత పేస్ బౌలింగ్ భారం పంచుకోనున్నారు.

ఓపెనర్‌గా పృథ్వీ షా లేదా మయాంక్ అగర్వాల్‌

ఓపెనర్‌గా పృథ్వీ షా లేదా మయాంక్ అగర్వాల్‌

ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో టెస్ట్‌ అరంగేట్రం చేసిన రిషబ్ పంత్‌ ఏకైక వికెట్ కీపర్‌గా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఓపెనర్‌గా పృథ్వీ షా లేదా మయాంక్ అగర్వాల్‌లలో ఎవరో ఒకరు కేఎల్ రాహల్‌తో ఓపెనింగ్‌కు దిగే అవకాశం ఉంది. కొత్త కుర్రాళ్ల ప్రదర్శన ఏ స్థాయిలో ఉండబోతోందో అని భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 స్వదేశంలో టీమిండియాది అత్యుత్తమ రికార్డు

స్వదేశంలో టీమిండియాది అత్యుత్తమ రికార్డు

తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, హనుమ విహారీలు సైతం ఈ సిరిస్‌లో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక, స్వదేశంలో సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యుత్తమ రికార్డుని కలిగి ఉన్న టీమిండియా విండిస్‌తో జరగనున్న సిరిస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తే టీమిండియా తన టెస్టు ర్యాంకుని మరింత పటిష్టం చేసుకుంటుంది.

వెస్టిండిస్ జట్టుతో తలపడే టీమిండియా:

వెస్టిండిస్ జట్టుతో తలపడే టీమిండియా:

విరాట్ కోహ్లి( కెప్టెన్ ), రహానే ( వైస్ కెప్టెన్ ), కేఎల్ రాహుల్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.

Story first published: Tuesday, October 2, 2018, 14:41 [IST]
Other articles published on Oct 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X