కావ్యా పాపా.. విన్నావా: అంబటి రిటైర్మెంట్ అట: మరేంటీ?

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ మిడిలార్డర్ బ్యాటర్, తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌కు అల్విదా పలికాడు. ఐపీఎల్ నుంచి కూడా వైదొలగనున్నట్లు ప్రకటించాడు. ఇదే తనకు చిట్టచివరి ఐపీఎల్ సీజన్ అని, తనను ఆదరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని చెప్పాడు. తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌పై దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశాడు. అక్కడే అసలు ట్విస్ట్ పెట్టాడు.

 4,187 పరుగులు..

4,187 పరుగులు..

ఈ గుంటూరు క్రికెటర్ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. 2010 సీజన్‌లో ఈ మెగా టోర్నమెంట్‌లో అడుగు పెట్టాడు. ఇప్పటివరకు 187 మ్యాచ్‌లు ఆడాడు. 4,187 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 22 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతని వ్యక్తిగత అత్యధిక స్కోర్.. 100. 127.26 స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 29.28. ఇదివరకు ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడాడు.

 ఈ సీజన్‌లో 271..

ఈ సీజన్‌లో 271..

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లను ఆడాడు అంబటి రాయుడు. 271 పరుగులు చేశాడు. అతని వ్యక్తిగత అత్యధిక స్కోర్ 78. 124.31 స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నాడు. అతని బ్యాటింగ్ మీద ఎలాంటి కంప్లయింట్స్ లేవు. క్రీజ్‌లో దిగిన ప్రతీసారీ పూర్తిస్థాయి కమిట్‌మెంట్‌, అదే రేంజ్ టెంపర్‌మెంట్‌తో ఆడతాడనే పేరుంది. మిడిలార్డర్‌లో భారీ భాగస్వామ్యాలను నెలకొల్పడంలో సిద్ధహస్తుడు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సమష్టిగా వైఫల్యం అయిందే తప్ప.. ఏ ఒక్క బ్యాటర్ వల్లో కాదు.

రిటైర్మెంట్ ప్రకటన పట్ల..

రిటైర్మెంట్ ప్రకటన పట్ల..

ఐపీఎల్‌లో సెకెండ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా చెన్నై సూపర్ కింగ్స్ నిలవడంలో అంబటి రాయుడు కూడా కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ నాలుగుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. అలాంటి అన్ని సీజన్లలోనూ అంబటి రాయుడు ఆడాడు. ఇప్పుడు ఉన్నట్టుండి రిటైర్మెంట్ ప్రకటించడం పట్ల క్రీడాలోకం విస్తుపోతోంది. దీనికి కారణాలేమిటంటూ ఆరా తీయడం ఆరంభించింది.

 చివరి టోర్నీ అంటూ..

చివరి టోర్నీ అంటూ..

ఇదే తన చివరి ఐపీఎల్ టోర్నమెంట్ అని చెప్పడానికి తాను సంతోషిస్తున్నానని ట్వీట్ చేశాడు. 13 సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్‌తో అసోసియేట్ అయి ఉన్నానని, రెండు అత్యుత్తమ జట్ల తరఫున ఆడటం అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని చెప్పాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని అన్నాడు. అదే సమయంలో అంబటి రాయుడు ట్విస్ట్ ఇచ్చాడు. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు చేసిన ట్వీట్‌ను డిలేట్ చేశాడు.

డిలేట్ చేయడంతో..

డిలేట్ చేయడంతో..

అప్పటికే ఈ సమాచారం మొత్తం దావానలంలా వ్యాపించింది. ట్వీట్‌ను డిలేట్ చేయడంతో.. ఐపీఎల్‌లో కొనసాగబోతున్నాననే సందేశాన్ని ఇచ్చినట్టే అయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తన ఐపీఎల్ జర్నీని వచ్చే సీజన్‌లో కూడా కంటిన్యూ చేస్తాడనే క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, May 14, 2022, 14:02 [IST]
Other articles published on May 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X