న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాదృశ్చికమో ఏమో! రాయుడు, విజయ్ శంకర్ ఇద్దరి పరుగులు ఒకటే!

IPL 2019 : Ambati Rayudu,Vijay Shankar End IPL League Stage With Identical Batting Numbers
Ambati Rayudu and Vijay Shankar end IPL 2019 league stage with same batting numbers

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడిని కాకుండా సెలక్టర్లు విజయ్ శంకర్ వైపు మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. రాయుడిని కాదని విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడానికి గల కారణాన్ని సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వివరణ ఇచ్చాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

విజయ్‌ శంకర్ ఆల్‌రౌండర్‌గా

విజయ్‌ శంకర్ ఆల్‌రౌండర్‌గా

విజయ్‌ శంకర్ ఆల్‌రౌండర్‌గా మూడు విభాగాల్లో పనికొస్తాడని తద్వారా జట్టు ప్రయోజనాలకు ఉపయోగపడుతాడని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. ఎమ్మెస్కే వివరణపై తీవ్ర అసంతృప్తికి గురైన అంబటి రాయుడు తన ట్విట్టర్‌లో 2019 వరల్డ్‌కప్‌ను వీక్షించేందుకు ఇప్పుడే 3డీ కళ్లజోడుని ఆర్డర్‌ చేశానని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై బీసీసీఐ సైతం స్పందించింది.

ఐపీఎల్‌లో ఇద్దరి మధ్య పోలిక

ఐపీఎల్‌లో ఇద్దరి మధ్య పోలిక

వరల్డ్‌కప్ కోసం జట్టుని ప్రకటించిన తర్వాత ఐపీఎల్ మొదలు కావడంతో వీరిద్దరి మధ్య పోలిక మొదలైంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ 12వ సీజన్‌లో విజయ్‌ శంకర్‌ సన్‌రైజర్స్‌కు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా ఆడుతుండగా... అంబటి రాయుడు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ రెండు జట్లు కూడా ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి.

యాదృశ్చికమో ఏమో

అయితే, యాదృశ్చికమో ఏమో గానీ ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ విధంగా రాణించకపోయినా ఇద్దరూ ఒకే గణాంకాలు నమోదు చేశారు. చెన్నై తరఫున రాయుడు, సన్‌రైజర్స్‌ తరఫున శంకర్‌ అన్ని మ్యాచ్‌లు (14) ఆడి 219 పరుగులు చేశారు. ఇందులో ఒక మ్యాచ్‌లో శంకర్‌కు బ్యాటింగ్‌ అవకాశం రాలేదు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇద్దరి సగటు కూడా (19.90) ఒకేలా ఉంది.

బౌండరీల ద్వారా 92 పరుగులు

బౌండరీల ద్వారా 92 పరుగులు

ఒక హాఫ్ సెంచరీ చేసిన అంబటి రాయుడు బౌండరీల ద్వారా 92 పరుగులు సాధించాడు. మరోవైపు 40 పరుగుల అత్యధిక స్కోరు సాధించిన విజయ్ శంకర్‌ కూడా అదే విధంగా 96 పరుగులు బౌండరీల నుంచి రాబట్టాడు. కాగాస అంబటి రాయుడు స్ట్రయిక్ రేట్ 90.49 కన్నా విజయ్‌ శంకర్‌ 120.32 స్ట్రయిక్ రేట్ కాస్త ఎక్కువగా ఉంది.

Story first published: Tuesday, May 7, 2019, 14:46 [IST]
Other articles published on May 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X