న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎవడో మెడపట్టి షాట్లు ఆడమన్నట్లు ఆడాడు.. విరాట్ కోహ్లీపై జడేజా ఫైర్!

Ajay Jadeja says It seems someone is forcing him to go and hit on Virat Kohlis dismissal

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో రెండో టీ20లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటైన తీరును మాజీ క్రికెటర్ అజేయ్ జడేజా తప్పుబట్టాడు. ఎవరో మెడపట్టి దూకుడుగా ఆడమన్నట్లు ఆడి విరాట్ మూల్యం చెల్లించుకున్నాడని తెలిపాడు. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 49 పరుగులతో గెలుపొందింది. ఐదు నెలల విరామం అనంతరం టీ20 మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ(1) తీవ్రంగా నిరాశపరిచాడు. ఎదుర్కొన్న మూడో బంతికే భారీ షాట్ ఆడి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. వచ్చి రాగానే విరాట్ తన శైలికి భిన్నంగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయడాన్ని జడేజా తప్పుబట్టాడు. మ్యాచ్ సందర్భంగా విరాట్ ఔటైన తీరును విశ్లేషించాడు.

శైలికి భిన్నంగా..

శైలికి భిన్నంగా..

'విరాట్ కోహ్లీ ఆడిన విధానం చూస్తే... ఎవరో వెనకనుంచి ధాటిగా ఆడాలని ఒత్తిడి చేసినట్లు అనిపించింది. ఎందుకంటే గత 15 ఏళ్లలో విరాట్ ఇలా ఆడటం ఎప్పుడూ చూడలేదు. విరాట్ తన కెరీర్‌లో ఎన్నో ఘనతలను అందుకున్నాడు. పరుగుల వరద పారించాడు. గత 15 ఏళ్లుగా అతని ఆటను చూసిన అభిమానులకు ఇంగ్లండ్‌తో ఔటైన విధానం కచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే విరాట్ ఎప్పుడూ ఇలా ఆడి ఔటవ్వలేదు. విరాట్ తనదైన శైలిలోనే ఆడి అద్భుత రికార్డులు నమోదు చేశాడు. అయితే దూకుడుగా ఆడటం తప్పేమి కాదు. కానీ విరాట్ కోహ్లీకి టీ20ల్లో యావరేజ్ 50గా ఉంది. స్ట్రైక్‌రేట్ 137. కొందరూ 140 స్ట్రైక్‌రేట్ కలిగి ఉన్నారు. కానీ వారెవరూ కోహ్లీలా 50 యావరేజ్ లేదు. కనీసం 20 కూడా లేదు'అని జడేజా పేర్కొన్నాడు.

విరాట్‌ను ఎంపిక చేయను..

విరాట్‌ను ఎంపిక చేయను..

ఇక తానే టీమ్ సెలెక్టర్‌ను అయితే విరాట్ కోహ్లీని అస్సలు జట్టులోకి తీసుకునేవాడిని కాదని జడేజా స్పష్టం చేశాడు. 'విరాట్ కోహ్లి చాలా ప్రత్యేకమైన ఆటగాడు. ఒకవేళ అలా కాకుంటే అతడు కోహ్లినే కాదు. అతడు టెస్టు క్రికెట్ కూడా ఆడి ఉండేవాడు కాదు. కోహ్లి నెంబర్లను చూపించి అయ్యో అతడు గత కొన్ని మ్యాచులుగా సెంచరీలు చేయడం లేదనడం.. తద్వారా కోహ్లిని తప్పించడం కరెక్ట్ కాదు. ఒక జట్టును ఎంపిక చేసేప్పుడు మీరు (టీమ్ సెలక్షన్ కమిటీ) ఎవరిని ఆడించాలనేదానిపై తుది నిర్ణయం ఉంటుంది. ఒకవేళ నేను గనక టీ20 జట్టును సెలక్ట్ చేయాల్సి వస్తే మాత్రం టీ20లలో అతడిని తీసుకోను..' అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవైపు కోహ్లిని గొప్ప ఆటగాడని పొగుడుతూనే జడేజా.. తాను సెలక్టర్ అయితే టీ20 లో తీసుకోనని వ్యాఖ్యానించడం గమనార్హం.

కపిల్ దేవ్ సైతం..

కపిల్ దేవ్ సైతం..

కపిల్ దేవ్ సైతం విరాట్ ‌పై వేటు వేయాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. 'అవును, ఇప్పుడు టీ20ల్లో విరాట్ కోహ్లీని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అతని కంటే మెరుగ్గా ఆడుతున్న కుర్రాళ్లు, టీమ్‌లో ప్లేస్ కోసం గట్టిగా పోటీపడుతున్నారు. అయినా వరల్డ్ నెం.2 రవిచంద్రన్ అశ్విన్‌ని టెస్టుల్లో ఆడించకుండా పక్కనబెట్టినప్పుడు, వరల్డ్ నెం.1 బ్యాటర్‌ని పక్కనబెడితే తప్పేంటి... కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అతని స్టాండెడ్స్‌కి తగ్గట్టుగా ఉండడం లేదు. కోహ్లీకి ఇంతటి క్రేజ్ రావడానికి అతని పర్ఫామెన్స్‌లే కారణంగా. ఇప్పుడు అతను పర్ఫామెన్స్ చేయనప్పుడు, కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడంలో తప్పులేదు.'అని కపిల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, July 10, 2022, 15:27 [IST]
Other articles published on Jul 10, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X