న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరుదైన గౌరవం: అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఒక స్టాండ్‌కి గంభీర్‌ పేరు

After Virat Kohli, Gautam Gambhir set to get a stand named by DDCA in Arun Jaitley Stadium

హైదరాబాద్: టీమిండియా మాజీ ఓపెనర్, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు అరుదైన గౌరవం లభించింది. రాజధాని ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలోని ఒక స్టాండ్‌కు గంభీర్ పేరు పెట్టనున్నారు. ఈ మేరకు ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్‌(డీడీసీఏ) తాజాగా నిర్ణయం తీసుకుంది.

కాగా, ఇప్పటికే స్టేడియంలోని ఓ స్టాండ్‌కి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబరులో ఒక వేడుకను నిర్వహించి మరీ కోహ్లీ పేరు పెట్టడం జరిగింది. ఈ వేడుకకు భారత జట్టులోని ఆటగాళ్లతో పాటు కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా హాజరైంది.

భవిష్యత్తులో భారత్ ఎక్కువ డే నైట్ టెస్టులు ఆడాలనుకుంటే ఈ పని చేయాల్సిందే: భజ్జీభవిష్యత్తులో భారత్ ఎక్కువ డే నైట్ టెస్టులు ఆడాలనుకుంటే ఈ పని చేయాల్సిందే: భజ్జీ

అరుణ్ జైట్లీ స్టేడియంలోని ఓ స్టాండ్‌కు గంభీర్ పేరు పెట్టడంపై డీడీసీఏ జాయింట్ సెక్రటరీ రాజన్‌ మంచండా మాట్లాడుతూ "స్టేడియంలోని ఓ స్టాండ్‌కు గంభీర్ పేరు పెట్టేందుకు అపెక్స్ కౌన్సిల్ అనుమతిచ్చింది. స్టేడియం ఎండ్‌లో ఉన్న(అంబేద్కర్ పుట్‌బాల్ స్టేడియం) స్టాండ్‌కు గంభీర్ పేరు పెట్టనున్నాం" అని అన్నారు.

ఓ స్టాండ్‌కి గంభీర్‌ పేరు

ఓ స్టాండ్‌కి గంభీర్‌ పేరు

"టీమిండియాకు గౌతమ్‌ గంభీర్‌ చేసిన సేవలకు ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాం. నిజానికి ఓ స్టాండ్‌కి గంభీర్‌ పేరు పెట్టాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. అపెక్స్ కౌన్సిల్ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నందున భారత క్రికెట్‌కు గంభీర్ చేసిన సహకారాన్ని మనం గౌరవించలేకపోవడం దురదృష్టకరం" అని చెప్పారు.

గంభీర్ పేరు యొక్క అక్షరాలను

గంభీర్ పేరు యొక్క అక్షరాలను

"ఇప్పటికే గంభీర్ పేరు యొక్క అక్షరాలను స్టాండ్ మీద ఉంచమని ఆదేశించాం. నేటి అపెక్స్ కౌన్సిల్ సభ్యుల సమావేశంలో, స్టాండ్‌ను ఆవిష్కరించాలని, గంభీర్‌ను సత్కరించాలని నిర్ణయించాం. వచ్చే రంజీట్రోఫీ సీజన్‌ నుంచే ఈ స్టాండ్‌ అందుబాటులోకి వస్తుంది" అని డీడీసీఏ జాయింట్ సెక్రటరీ రాజన్‌ మంచండా తెలిపారు.

2003లో వన్డే క్రికెట్‌ అరంగ్రేటం

2003లో వన్డే క్రికెట్‌ అరంగ్రేటం

2003లో వన్డే క్రికెట్‌ అరంగ్రేటం చేసిన గంభీర్ ముంబైలోని వాంఖడె వేదికగా శ్రీలంకతో జరిగిన 2011 వన్డే వరల్డ్‌కప్‌ పైనల్ మ్యాచ్‌లో కీలకపాత్ర పోషించాడు. 2011 వరల్డ్‌కప్ తర్వాత గంభీర్‌ పేలవ ప్రదర్శన చేయడంతో జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. అయితే 2012, 2014 ఐపీఎల్‌ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టుకు ట్రోఫీలను అందించాడు.

2009లో ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా

2009లో ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా

టెస్టుల్లో సైతం గంభీర్ రికార్డు బాగానే ఉంది. 2008 జులై నుంచి 2010 జనవరి మధ్య కాలంలో తాను ఆడిన 13 టెస్టుల్లో 8 సెంచరీలు సాధించాడు. 2009లో ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. 2009లో నేపియర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో గంభీర్ ఇన్నింగ్స్ ఇప్పటికీ ప్రతి క్రికెట్ అభిమానికీ గుర్తే.

2018 డిసెంబర్‌లో క్రికెట్‌కు వీడ్కోలు

2018 డిసెంబర్‌లో క్రికెట్‌కు వీడ్కోలు

2018 డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గంభీర్ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీల చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం ఈస్ట్‌ ఢిల్లీకి ఎంపీగా ఉన్నారు. టెస్టుల్లో వరుసగా ఐదు సెంచరీలు సాధించిన ఏకైక భారత బ్యాట్స్ మెన్ గౌతమ్ గంభీరే.

Story first published: Thursday, November 21, 2019, 11:29 [IST]
Other articles published on Nov 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X