రజనీకి షాకిచ్చిన బీసీసీఐ: నల్ల దుస్తులతో మ్యాచ్‌కోస్తే నో ఎంట్రీ!

Posted By:
After Rajinikanth’s call to boycott IPL, Chennai Police asks BCCI to ban black shirts in stadium

హైదరాబాద్: కావేరీ నది జలాల కోసం తమిళనాడు పెద్ద ఎత్తున్న నిరసనలు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్‌లను తాకాయి. కావేరీ నది జలాల కోసం తమిళనాడు పెద్ద ఎత్తున్న నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు తమిళ సినీ పరిశ్రమ కూడా మద్దతిచ్చింది.

ఆదివారం తమిళ స్టార్ హీరోలంతా చెన్నైలో శాంతియుత నిరసన చేపట్టారు. అయితే ఈ సందర్భంగా తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ ఇలాంటి సమయంలో చెన్నైలో ఐపీఎల్ నిర్వహణ సరికాదని, మ్యాచ్‌లను బహిష్కరించాలని క్రికెట్ అభిమానులకు పిలపునిచ్చారు.

తమిళ ప్రజల నిరసనకు రజనీకాంత్ మద్దతు

తమిళ ప్రజల నిరసనకు రజనీకాంత్ మద్దతు

అలాగే తమిళ ప్రజల నిరసనకు మద్దతు తెలుపుతూ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి క్రికెట్ ఆడాలని ఆయన సూచించారు. రజనీకాంత్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్ రద్దు చేయాలని పలు పార్టీలు పిలుపునివ్వడంతో 2,000 మంది పోలీసు సిబ్బందిని స్టేడియం వద్ద మోహరిస్తున్నారు.

 నల్ల దుస్తులతో వచ్చే వారికి అనుమతి లేదు

నల్ల దుస్తులతో వచ్చే వారికి అనుమతి లేదు

మ్యాచ్‌ను తిలకించడానికి నల్ల దుస్తులతో వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేడియంలోకి అనుమతించేది లేదని పోలీసు వర్గాలు తెలిపారు. తమిళనాడులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్ లాంటి హీరో పిలుపునిస్తే ఆ ప్రభావం కచ్చితంగా మ్యాచ్‌పై పడుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండేళ్ల తరవాత చెన్నై మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెట్టి చెపాక్ స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడబోతోంది. చెన్నై అభిమానులు కూడా ఎప్పుడెప్పుడా అని మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నాం

కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నాం

మరోవైపు ఐపీఎల్ నిర్వాహకులకు అవసరమైన భద్రత కల్పిస్తున్నట్టు తమిళనాడు మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఐపీఎల్ మ్యాచ్ జరపాలా వద్దా అనేది నిర్వహకులు నిర్ణయించుకోవాలని, అలగే ఐపీఎల్‌ను బహిష్కరించాలా? లేదా అనేది కూడా ప్రజలే నిర్ణయింకుంటారు' అని అన్నారు.

మ్యాచ్‌కి వ్యతిరేకంగా నిరసన చేపడతాం

మ్యాచ్‌కి వ్యతిరేకంగా నిరసన చేపడతాం

మరోవైపు, మ్యాచ్‌కు వ్యతిరేకంగా తాము నిరసన చేపడతామని తమిళ్ పాన్‌పాట్టు పెరవై అసోసియేషన్ ప్రకటించింది. తమిళ దర్శకుడు భారతీరాజా, ఆర్కే సెల్వమణి, వి.శేఖర్ సారథ్యంలో సోమవారంనాడు ఈ అసోసియేషన్ ఏర్పాటైంది. షెడ్యూల్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య చిదంబరం స్టేడియంలో మంగళవారం నాడు మ్యాచ్ జరుగనుంది.

చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లపై రజనీకాంత్ ఇలా

చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లపై రజనీకాంత్ ఇలా

‘వారే స్వయంగా మ్యాచ్‌ను ఆపేస్తే బాగుంటుంది. లేదంటే కనీసం చెన్నై జట్టు సభ్యులైనా నల్ల బ్యాండ్‌లు తగిలించుకుని మ్యాచ్ ఆడి తమిళనాడు ప్రజలకు మద్దతు తెలపాలి. ఇలా చేస్తే ఈ నిరసన దేశవ్యాప్తంగా తెలుస్తుంది. ఆటగాళ్లు నల్ల బ్యాండ్స్ ధరించడానికి బీసీసీఐ, ఐపీఎల్ అధికారులు, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అనుమతిచ్చి సహకరించాలి' అని అన్నారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 9, 2018, 21:19 [IST]
Other articles published on Apr 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి