న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ పర్యటనకు ముందు బంగ్లాకు దెబ్బ: మొన్న ముష్ఫికర్.. నేడు కోచింగ్ సిబ్బంది!

After Mushfiqur Rahim, Bangladesh Coaches Opt Out Of Pakistan Tour

హైదరాబాద్: పాకిస్థాన్ పర్యటనకు ముందు బంగ్లాదేశ్‌కు మరో దెబ్బ. బంగ్లాదేశ్ కోచింగ్ సిబ్బందిలో ఐదుగురు సభ్యులు పాక్ పర్యటనకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, సీనియర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్ తాను పాక్ పర్యటనకు వెళ్లబోనని ఇప్పటికే ప్రకటించాడు.

ఈ మేరకు అక్కడ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముష్ఫికర్ రహీమ్ ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో క్రికెట్‌ కంటే తనకి ప్రాణం ముఖ్యమని పేర్కొన్నాడు. "పాక్‌లో భద్రతపై మా ఫ్యామిలీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే నేను పాక్ పర్యటనకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా" అని తెలిపాడు.

అనుష్కతో ఆ భంగిమలు ట్రై చేయలేదా?: కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై రచయిత్రి అశ్లీల ట్వీట్అనుష్కతో ఆ భంగిమలు ట్రై చేయలేదా?: కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై రచయిత్రి అశ్లీల ట్వీట్

తాజాగా, బంగ్లాదేశ్ కోచింగ్ సిబ్బందిలో ఐదుగురు పాక్ పర్యటనకు వెళ్లకూడదని నిర్ణయించుకున్న విషయాన్ని బోర్డు క్రికెట్ ఆపరేషన్స్ ఛైర్మన్ అక్రమ్ ఖాన్ ధ్రువీకరించారు. ప్రస్తుతం జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు నీల్ మెకెంజీ ఫీల్డింగ్ కోచ్ రియాన్ కుక్‌తో పాటు పర్యటన నుంచి తప్పుకున్నాడు.

ఇటీవలే బంగ్లాదేశ్ జట్టుకు స్పిన్ కన్సల్టెంట్‌గా నియమించిన డేనియల్ వెట్టోరి సేవలను పొందకూడదని బోర్డు నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం మూడు టీ20లు, ఒక వన్డే, రెండు టెస్టుల సిరీస్‌ కోసం బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే, ఈ పర్యటనను మూడు భాగాలుగా విభజించబారు. జనవరి 24 నుండి 27 మధ్య జరగనున్న మూడు టి20లతో ఈ సిరిస్ ప్రారంభమవుతుంది.

ఆ తర్వాత ఫిబ్రవరి 7 నుండి టెస్టు సిరిస్ ప్రారంభమవుతుంది. టీ20 సిరిస్ ముగిసిన తర్వాత తొలి టెస్టు ఆడటానికి ముందు బంగ్లాదేశ్ జట్టు స్వదేశానికి బయల్దేదురుతుంది. దీని తర్వాత మరో విరామం ఉంటుంది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు ముగిసిన తర్వాత పాకిస్థాన్ జట్టులోని పలువురు ఆటగాళ్లు పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడనున్నారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ మార్చి 22తో ముగుస్తుంది.

వాటే కోఇన్సిడెన్స్.. ఫస్ట్ వన్డేలో ఇండియా.. సెకండ్ వన్డేలో ఆసీస్.!వాటే కోఇన్సిడెన్స్.. ఫస్ట్ వన్డేలో ఇండియా.. సెకండ్ వన్డేలో ఆసీస్.!

ఆ తర్వాత ఇరు జట్ల మధ్య ఏప్రిల్ 5న రెండో మ్యాచ్ జరగనుంది. అయితే, రెండో టెస్టు జరగడానికి ముందు మార్చి 3వ తేదీన ఇరు జట్ల మధ్య ఏకైక వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు టెస్టులు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిఫ్‌లో భాగంగానే జరగనున్నాయి. 2009లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తోన్న బస్సుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత పాక్లో పర్యటించేందుకు ఏ జట్టూ ఆసక్తి కనబర్చడం లేదు.

కాగా, గతేడాది చివర్లో పాక్‌లో శ్రీలంక జట్టు పర్యటించింది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం అధ్యక్షస్థాయి భద్రతను కల్పించినప్పటికీ... బంగ్లాదేశ్ క్రికెటర్లు మాత్రం పాక్‌లో పర్యటించేందుకు వెనుకంజ వేస్తున్నారు.

Story first published: Saturday, January 18, 2020, 18:18 [IST]
Other articles published on Jan 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X