న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీబీఎల్‌లో తొలిసారి: ఆ ఔట్‌పై ఎందుకంత చర్చ (వీడియో)

By Nageshwara Rao
After Inzamam, cricket fans witness most bizarre runout in BBL. McCullum, Vettori in utter disbelief

హైదరాబాద్: క్రికెట్ జెంటెల్మెన్ గేమ్. ఈ ఆటలో బ్యాట్స్‌మెన్ పలు రకాలుగా ఔటై పెవిలియన్‌కు చేరుతుంటారు. అందులో ఒకటి అబ్‌స్ట్రక్టింగ్‌ అవుట్‌. బ్యాట్స్‌మన్‌ ఉద్దేశపూర్వకంగా బంతికి అడ్డుతగిలితే దానిని అబ్‌స్ట్రక్టింగ్‌ అవుట్‌గా పరిగణిస్తారు. తాజాగా బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)లో ఇలాంటి ఔటై ఒకటి చోటు చేసుకుంది.

బిగ్ బాష్ లీగ్ టోర్నీ 24వ మ్యాచ్‌లో భాగంగా బ్రిస్బేన్ హీట్-హోబర్ట్ హరికేన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హరికేన్స్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. డీ ఆర్సీ షార్ట్‌(122, 69 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్ల) సాయంతో సెంచరీతో మెరిశాడు.

అనంతరం 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హోబర్ట్ హరికేన్స్‌కు ఓపెనర్లు చక్కటి శుభారంభం ఇచ్చారు. అయితే మూడో వికెట్‌గా బరిలోకి దిగిన అలెక్స్ రాస్ ఈ మ్యాచ్‌లో అబ్‌స్ట్రక్టింగ్‌ ఔట్‌గా పెవిలియన్‌‌కు చేరడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ వీడియోలో బ్రిస్బేన్‌ హీట్‌ ఇన‍్నింగ్స్‌లో భాగంగా తైమాల్‌ మిల్స్‌ వేసిన 17 ఓవర్‌ చివరి బంతిని అలెక్స్‌ రాస్ కార్నర్‌లో కొట్టి తొలి పరుగును విజయవంతంగా పూర్తిచేశాడు. అయితే రెండో పరుగును తీసే క్రమంలో వేగంగా క్రీజులోకి దూసుకొచ్చిన సమయంలో బంతిని గమనించని అలెక్స్‌ వికెట్లకు అడ్డంగా డైవ్ చేయడంతో బంతి అతడి బ్యాట్‌ని తాకి వికెట్లను తాకింది.

అయితే అప్పటికి అలెక్స్‌ క్రీజులో చేరుకున్నప్పటికీ, అబ్‌స్ట్రక్టింగ్‌ ఔట్‌ అంటూ థర్డ్‌ అంపైర్‌ ప్రకటించాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ మాదిరి ఔట్లను గతంలో చూసినప్పటికీ, బీబీఎల్‌లో మాత్రం ఈ తరహాలో అవుటైన తొలి బ్యాట్స్‌మన్‌గా అలెక్స్‌ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ హరికేన్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అలెక్స్‌ను ఔట్‌గా థర్డ్ అంఫైర్ ప్రకటించడంపై ఆసీస్ వికెట్ కీపర్ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ మండిపడ్డాడు. అలెక్స్‌ ఉద్దేశపూర్వకంగా బంతిని ఆపకపోయినప్పటికీ... అతడిని ఔట్‌గా ఎలా పరిగణిస్తారంటూ విమర్శించాడు. థర్డ్ అంఫైర్ నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకొచ్చాడు. తన దృష్టిలో ఇది కచ్చితంగా అబ్‌స్ట్రక్టింగ్‌ ఔట్‌ కాదని అన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 11, 2018, 15:45 [IST]
Other articles published on Jan 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X