సర్వత్రా ఆసక్తి: హైదరాబాద్ టీ20కి 'సీక్రెట్ సూపర్ స్టార్'

Posted By:

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే చివరి టీ20కి హైదరాబాద్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ టీ20కి ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు టెస్టులు, వన్డేలకు వేదికైన ఉప్పల్‌‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియం తొలిసారి టీ20 మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోంది.

భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌ శుక్రవారం రాత్రి 7 గంటలకు జరగనుంది. మూడు టీ20ల సిరిస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉండటంతో హైదరాబాద్ మ్యాచ్‌ సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు బుధవారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు.

 హాట్‌ కేకుల్లా అమ్ముడైన టిక్కెట్లు

హాట్‌ కేకుల్లా అమ్ముడైన టిక్కెట్లు

పది రోజుల కిందటే టిక్కెట్ల అమ్మకాలు మొదలవగా, అన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. టిక్కెట్లు కొనుగోలు చేసిన వారు మ్యాచ్‌ రోజు ఎప్పుడొస్తుందా? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. గురు, శుక్రవారాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దాంతో, ఈ మ్యాచ్‌ సజావుగా జరుగుతుందా? లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎంత వర్షం కురిసినా 2 గంటలు తెరిపిస్తే మైదానాన్ని సిద్ధం చేస్తామని హెచ్‌సీఏ సిబ్బంది చెబుతున్నారు.

ఇప్పటివరకు ఐదు వన్డేలు, నాలుగు టెస్టులు

ఇప్పటివరకు ఐదు వన్డేలు, నాలుగు టెస్టులు

ఉప్పల్‌ స్టేడియంలో ఇప్పటివరకు ఐదు వన్డేలు, నాలుగు టెస్టులు జరిగాయి. 2005 నవంబర్‌ 16న దక్షిణాఫ్రికాతో వన్డేకు ఈ స్టేడియం తొలిసారి ఆతిథ్యం ఇచ్చింది. ఆ మ్యాచ్‌లో ఓడిన భారత్‌ తర్వాత ఆస్ట్రేలియా (2007,09)తో రెండు వన్డేల్లోనూ ఓడింది. కానీ, చివరి రెండు వన్డేల్లో ఇంగ్లండ్‌ (2011), శ్రీలంక (2014)పై విజయాలు సాధించింది.

 ఉప్పల్‌లో విరాట్‌ కోహ్లీకి మెరుగైన రికార్డు

ఉప్పల్‌లో విరాట్‌ కోహ్లీకి మెరుగైన రికార్డు

ఇక, టెస్టుల్లో న్యూజిలాండ్‌తో రెండు సార్లు (2010, 12), ఆస్ట్రేలియా (2013), బంగ్లాదేశ్‌ (2017)తో ఒకసారి భారత్‌ తలపడింది. న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌ని డ్రా చేసుకున్న టీమిండియా మిగతా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈ మైదానంలో విరాట్‌ కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాతో జరిగిన టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు.

ఆసీస్ కెప్టెన్ వార్నర్‌కు ప్రత్యేక అనుబంధం

ఆసీస్ కెప్టెన్ వార్నర్‌కు ప్రత్యేక అనుబంధం

అంతకుముందు ఇదే మైదానంలో శ్రీలంకతో జరిగిన వన్డేలో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. హాఫ్‌ సెంచరీ అనంతరం స్టాండ్స్‌లో ఉన్న తన ప్రేయసి అనుష్క శర్మకు మైదానం నుంచి విరాట్ కోహ్లీ ఫ్లయింగ్‌ కిస్‌లు ఇవ్వడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక, ధావన్‌తో పాటు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ఆడిన వార్నర్‌, భువీలకు ఈ మైదానంతో ప్రత్యేక అనుబంధం ఉంది.

 మ్యాచ్‌కు ‘సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌'

మ్యాచ్‌కు ‘సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌'

శుక్రవారం జరిగే ఈ మ్యాచ్‌కు సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌ హాజరవనున్నాడు. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ ప్రస్తుతం సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌ అనే సినిమా ప్రమోషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. క్రికెట్‌ అంటే ఎంతగానో ఇష్టపడే అమీర్‌ ఖాన్, తన నూతన సినిమా ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌' ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్‌ జైరాతో కలిసి శుక్రవారం మ్యాచ్‌కు రానున్నాడని వార్తలు వస్తున్నాయి.

Story first published: Thursday, October 12, 2017, 10:22 [IST]
Other articles published on Oct 12, 2017
Please Wait while comments are loading...
POLLS