న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓపెనర్‌గా కోహ్లీ..మూడులో పాటీదార్‌! విదేశీ కోటాలో ఆ నలుగురికి చోటు!ఐపీఎల్‌లో ఆకాష్‌ చోప్రా బెంగళూరు జట్టు ఇదే

Aakash Chopras RCB Playing XI For IPL 2021: Virat Kohli as opener, AB de Villiers at No 5

ముంబై: కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది మేలో అర్ధంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 సందడి మళ్లీ షూరూ కాబోతుంది. ఐపీఎల్‌ 2021 రెండో అంచె పోటీలు ఆదివారం (సెప్టెంబర్ 19) నుంచి మొదలవ్వనున్నాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు ఐపీఎల్‌ సె​కెండ్‌ ఫేజ్‌లో భాగంగా సెప్టెంబర్‌ 20న తన తొలి మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్)తో తలపడనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, స్టార్ కామెంటేటర్ ఆకాష్‌ చోప్రా.. ఐపీఎల్‌ రెండో దశలో పాల్గోనే ఆర్‌సీబీ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు.

Ravi Shastri: ఆ ఒక్కటి సాధిస్తే.. అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు: శాస్త్రిRavi Shastri: ఆ ఒక్కటి సాధిస్తే.. అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు: శాస్త్రి

ఓపెనర్లుగా కోహ్లీ, పడిక్కల్‌:

ఓపెనర్లుగా కోహ్లీ, పడిక్కల్‌:

ఆకాష్‌ చోప్రా తన ఆర్‌సీబీ జట్టుకు ఓపెనర్లుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్‌ని ఎంచుకున్నాడు. యువ క్రికెటర్ రజత్ పాటీదార్‌కు మూడో స్థానం ఇచ్చి.. అతడిని ‍కూడా ఓపెనర్‌గా పంపొచ్చని తెలిపాడు. ఒకవేళ పాటీదార్‌ ఓపెనర్‌గా వెళితే కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడన్నాడు. స్టార్ ప్లేయర్స్ గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్‌కు మిడిల్ ఆర్డర్‌లో ఆకాశ్‌ అవకాశం ఇచ్చాడు. మ్యాక్సీ నాలుగులో, ఏబీ ఐదులో రావాలన్నాడు. ఆల్‌రౌండర్‌లు అయిన షాబాజ్ అహ్మద్, కైల్ జమీసన్‌కు ఆరు, ఏడు స్ధానాల్లో ఆకాష్ తన జట్టులో చోటు ఇచ్చాడు.

విదేశీ కోటాలో:

విదేశీ కోటాలో:

ఆకాష్‌ చోప్రా ఎంచుకున్న ఆర్‌సీబీ జట్టు బౌలింగ్‌ విభాగంలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్, హర్షల్‌ పటేల్‌, శ్రీలంక ఫాస్ట్‌ బౌలర్‌ దుశ్మంత చమీరా, భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ ఉన్నారు. విదేశీ కోటాలో గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్‌, కైల్ జమీసన్‌, దుశ్మంత చమీరాలకు చోటిచ్చాడు. దుశ్మంత ఇటీవలే జట్టులోకి రాగా.. మొదటి అంచె పోటీల్లో మ్యాక్సీ, ఏబీ, కైల్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. టోర్నమెంట్ ప్రారంభంలో జట్టు మార్పులు చేయడం మానుకోవాలని కోహ్లీ బృందానికి స్టార్ కామెంటేటర్ ఆకాష్ సూచించాడు. ప్రాక్టీస్ మ్యాచుల్లో అదరగొట్టిన మహమ్మద్ అజారుద్దీన్, కెఎస్ భరత్ లాంటి యువ ప్లేయర్లకు చోప్రా చోటివ్వలేదు.

సామ్స్‌ స్థానంలో చమీరా:

సామ్స్‌ స్థానంలో చమీరా:

ఐపీఎల్ 2021 ఆగిపోయేవరకు వరకు ఆర్‌సీబీ ఏడు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచులు గెలిచి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. కరోనా భయంతో లీగ్ మధ్యలోనే జట్టును వీడిన ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా స్థానంలో ఆర్‌సీబీ.. శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగాను తీసుకుంది. వ్యక్తిగత కారణాలతో సెకండాఫ్ లీగ్‌కు దూరమైన డానియల్ సామ్స్‌ స్థానంలో శ్రీలంకకే చెందిన దుష్మంత చమీరాతో ఒప్పందం కుదుర్చుకుంది. న్యూజిలాండ్ టీమ్ తరఫున బిజీగా ఉన్న ఫిన్ అలెన్ ప్లేస్‌లో టిమ్ డేవిడ్, గాయంతో దూరమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆకాశ్ దీప్‌లు జట్టులోకి వచ్చారు.

ఆకాష్‌ చోప్రా ఆర్‌సీబీ ప్లేయింగ్ ఎలెవన్‌ ఇదే:

ఆకాష్‌ చోప్రా ఆర్‌సీబీ ప్లేయింగ్ ఎలెవన్‌ ఇదే:

దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, కైల్ జమీసన్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్, హర్షల్‌పటేల్‌, దుష్మంత చమీరా.

Story first published: Saturday, September 18, 2021, 15:54 [IST]
Other articles published on Sep 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X