న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీ, కోహ్లీ చెప్పారనే అలా చేశాం'

A+ Category Was Proposed by Virat Kohli and MS Dhoni: Vinod Rai

హైదరాబాద్: భారత క్రికెటర్ల జీతాల పెంపు విషయంపై మరోసారి చర్చ మొదలైంది. ఇటీవలే బీసీసీఐ పరిపాలన కమిటీ (సీవోఏ) చీఫ్ వినోద్ రాయ్ ఈ విషయంపై చర్చ లేవనెత్తారు. అసలు ఈ ప్రతిపాదన తీసుకొచ్చిందే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలనే విషయాన్ని స్పష్టం చేశారు. వీళ్లకు నిర్దేశించిన స్థానాలేవి సుస్థిరం కాదని వాళ్ల ప్రదర్శనను బట్టే కేటగిరీ నిర్ణయించబడుతుందని తెలిపారు.

పెంపు విషయమై చర్చలో పాల్గొన్న ధోనీ, కోహ్లీతో మాట్లాడాం. ప్రపంచస్థాయి నైపుణ్యంతో పాటు మూడు ఫార్మాట్లలో ఆడే వారికి సముచిత గౌరవం ఇవ్వాలని వారు కోరారు. ఇది స్థిరమైన కేటగిరీ కాదు. ఓ రకంగా చెప్పాలంటే మంచి నైపుణ్యం చూపేవారికి ఇది రివార్డులాంటిది అని రాయ్ పేర్కొన్నారు.

విరాట్, ధోనీ మధ్య అద్భుతమైన సమన్వయం, పరస్పర గౌరవం ఉందన్నారు. జట్టులో ఇప్పటికిప్పుడు ధోనీ స్థానాన్ని భర్తీ చేసే కీపర్ లేడని కోహ్లీ అభిప్రాయం. దీనికితోడు మహీకి క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌లపై ఉన్న అనుభవం వెలకట్టలేనిది. జట్టుకు ఇది గొప్ప ఆస్థిలాంటిది. ధోనీ ఇంకెంత కాలం జట్టులో కొనసాగుతాడో అతడి ప్రదర్శనే నిర్ణయిస్తుంది.

దేశీవాళీ టోర్నీల్లో ఆడే క్రికెటర్లకు పెద్ద మొత్తంలో లాభం చేకూరుతుంది. కొత్త విధానం ప్రకారం ఏడాదికి రూ. 22 లక్షల వరకూ అందుకుంటారు. వీటికి అదనంగా మరికొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఇతర ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా కేవలం ఈ వేతనాలతోనే ఆటపై బాగా దృష్టిపెట్టేందుకు దోహదపడుతుంది అని రాయ్ వెల్లడించారు.

సెంట్రల్ కాంట్రాక్ట్‌కు సంబంధించిన ప్రతి అంశాన్నీ ఆఫీస్ బేరర్ల ముందు ఉంచామని స్పష్టం చేశారు. అందరి ఆమోదం మేరకు తుది నిర్ణయం తీసుకున్నామన్నారు.

Story first published: Monday, March 19, 2018, 9:42 [IST]
Other articles published on Mar 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X