న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎవరీ చారులత?: మ్యాచ్‌ టికెట్లు ఇప్పిస్తా ఆమె ఎవరో కనిపెట్టాలన్న ఆనంద్ మహీంద్రా

87-year-old superfan Charulata Patel wins over Anand Mahindra: Will pay her tickets for India matches

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌కు చేరింది. టోర్నీలో భాగంగా మంగళవారం బర్మింగ్‌హామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరిన తొలి ఆసియా జట్టుగా కోహ్లీసేన నిలిచింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేసి నెటిజన్లు మురిసిపోయారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఖాతాలో అనేక రికార్డులు చేరాయి. అయితే, ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లను మించి ఓ అభిమాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎంత‌గా అంటే- గ్యాప్ వ‌చ్చిన ప్ర‌తీసారీ కెమెరామెన్ ఆ పెద్దావిడ‌ వైపే త‌న ఫోక‌స్ పెట్టేంత‌గా!

మ్యాచ్ ఆరంభం నుంచీ కెమెరా క‌ళ్ల‌న్నీ ఆమె చుట్టే తిరిగాయి. అయితే, ఆమె సెలబ్రిటీ కాదు. అయినా, తన చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షించారు. పొడుగు చేతుల స్వెట్ట‌ర్‌, మెడ‌లో స్కార్ఫ్‌లా ధ‌రించిన దుప‌ట్టా, చెంప‌ల‌పై త్రివ‌ర్ణ ప‌తాకాన్ని పెయింట్ చేసుకుని క‌నిపించిన ఆ వృద్ధురాలి పేరు చారుల‌తా ప‌టేల్‌. వ‌య‌స్సు 87 సంవ‌త్స‌రాలు.

సెంట‌ర్ ఆఫ్ ద అట్రాక్ష‌న్‌గా

అయిన‌ప్ప‌టికీ- యంగ్ జ‌న‌రేష‌న్‌కు తీసిపోని విధంగా సంద‌డి చేశారామె. ఈ మ్యాచ్‌లో సెంట‌ర్ ఆఫ్ ద అట్రాక్ష‌న్‌గా నిలిచారు. టీమిండియా బ్యాట్స్‌మెన్లు షాట్ కొట్టిన ప్ర‌తీసారీ.. పొడుగాటి బూర‌ను ఊదుతూ చిన్న‌పిల్ల‌లా మారిపోయారు. నిజానికి ఆమె న‌డ‌వ‌లేరు. అయిన‌ప్ప‌టికీ- మ్యాచ్‌ను చూడాలనే ఆశ‌తో వీల్ ఛైర్‌లో స్టేడియానికి వ‌చ్చారు. తనకు భారత జట్టంటే చాలా ఇష్టమని, ఆటగాళ్లు తన పిల్లల్లాంటి వారని అన్న ఈ బామ్మ టీమిండియా కచ్చితంగా ప్రపంచకప్‌ గెలుస్తుందని చెప్పింది. మ్యాచ్ ముగిసిన అనంత‌రం విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ నేరుగా చారుల‌త పటేల్ వ‌ద్ద‌కు వెళ్లారు. భ‌క్తిభావంతో న‌మ‌స్క‌రించారు. చారుల‌త ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.

కోహ్లీ-రోహిత్‌కు ముద్దులు పెట్టిన బామ్మ

ఈ క్రమంలో వాళ్లిద్దరికీ బామ్మ ముద్దులు కూడా పెట్టడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటోల‌ను విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. అయితే, మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఈ బామ్మ చేసి సందడి అంతా ఇంతా కాదు. "వయసు అనేది నెంబర్ మాత్రమే. భారత్-బంగ్లా మ్యాచ్‌లో ఈ బామ్మ ఛీరింగ్ అద్భుతం. కామెంటేటర్లు సౌవర్ గంగూలీ, హర్షా బోగ్లేల మనసు గెలుచుకుంది" అంటూ బూర ఊదుతున్న బామ్మ ఫోటో వైరల్ అయింది.

ఆమె మ్యాచ్ విన్నర్ లాగా ఉంది

ఈ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా "సంప్రదాయం ప్రకారం... నేను మ్యాచ్ ఈ మ్యాచ్ చూడటం లేదు. ఆమె చూసేందుకు గాను ఇప్పుడు టీవీ ఆన్ చేస్తున్నాను. ఆమె మ్యాచ్ విన్నర్ లాగా ఉంది" అని ట్వీట్ చేశాడు. ఆ తర్వాత ఓ నెటిజన్ ఆమెకు మీరు ఎందుకు స్పాన్సర్ చేయకూడదు? అంటూ ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించాడు. దీంతో ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్‌లో "ఆమె ఎవరు కనిపెట్టండి. టీమిండియా ఆడే తదుపరి మ్యాచ్ టికెట్లు, ఇతర ఖర్చులు స్పాన్సర్‌ చేస్తా" అంటూ ఆనంద్‌ మహీంద్రా తన ట్విట్టర్‌లో ప్రకటించారు.

టీమిండియా ఆడిన ఏ మ్యాచ్‌ను కూడా వదల్లేదు

టీమిండియా ఆడిన ఏ మ్యాచ్‌ను కూడా వదల్లేదు

కాగా, చారులత ప‌టేల్ ద‌శాబ్దాల కింద‌టే క్రికెట్ అభిమానిగా మారిపోయారు. టీమిండియా ఆడిన ఏ మ్యాచ్‌ను కూడా ఆమె వ‌దులుకోలేద‌ట‌. 1983లో క‌పిల్ దేవ్ కేప్టెన్సీలో భార‌త క్రికెట్ జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడిన అపురూప స‌న్నివేశానికి కూడా చారుల‌త ప్ర‌త్య‌క్ష సాక్షి. ఆ మ్యాచ్‌ను కూడా తాను స్టేడియంలో కూర్చుని చూశాన‌ని ఆమె వెల్ల‌డించారు. మ్యాచ్ అనంత‌రం ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారామె. కపిల్ పాజీ నేతృత్వంలో టీమిండియా ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డాన్ని తాను ప్ర‌త్య‌క్షంగా చూశాన‌ని, ఈ సారి కూడా విరాట్ కోహ్లీ నేతృత్వంలోని క్రికెట్ జ‌ట్టు క‌ప్పు గెలుస్తుంద‌ని తాను ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. భార‌త జ‌ట్టు క‌ప్పు గెల‌వాల‌ని తాను గ‌ణేషుడిని ప్రార్థిస్తున్నాన‌ని అన్నారు.

1
43683

{headtohead_cricket_3_10}

Story first published: Wednesday, July 3, 2019, 12:43 [IST]
Other articles published on Jul 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X