న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వాండరర్స్ స్టేడియంపై ఐసీసీ ఇన్వెస్టిగేషన్ చేయించాల్సిందే: గంగూలీ

 3rd Test: Sourav Ganguly calls for ICC investigation into 'unfair' Johannesburg pitch

హైదరాబాద్: భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మూడో టెస్టు మ్యాచ్ వాండరర్స్ స్టేడియం వేదికగా జరిగింది. ఇందులో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 187 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు అంత తక్కువ స్కోరుకే ఔట్ అవడంపై భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇలా స్పందించాడు.

ఈ మ్యాచ్ చూశాక నేను చాలా నిరుత్సాహపడ్డాను. చూడబోతే భారత్ ఆటగాళ్లకు పిచ్ అనుకూలించినట్లు లేదు. 2003 న్యూజిలాండ్‌ పిచ్‌లో ఆడినప్పుడు మాకు ఇదే పరిస్థితి ఎదురైంది. పిచ్‌పై ఐసీసీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేయించాలంటూ అభిప్రాయపడ్డాడు. ఈ వ్యాఖ్యలను అతను తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నాడు.

అయితే భారత స్కోరు 187 గురించి స్పందించిన పూజారా ' ఇలాంటి పిచ్‌పై 187పరుగులు సాధించడమే ఎక్కువ. అక్కడికీ ఈ పరుగులు చేయడం కోసం మేమెంతో కష్టపడ్డాం. ఎవరైనా ఈ పిచ్‌పై సెంచరీ చేయగలిగారంటే అది అద్భుతమనే చెప్పాలి.' అని పేర్కొన్నాడు.

'నేను ఆడిన మైదానాల్లో ఇదే పరుగులు తీసేందుకు టఫ్‌గా అనిపించింది. ఆ మాత్రం పరుగులు చేయడానికైనా మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. మేము ఖచ్చితంగా దక్షిణాఫ్రికా జట్టు పరుగులను కట్టడి చేయగలం.' అంటూ అభిప్రాయపడ్డాడు.

మొదటి రోజు జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు అందరూ విజయవంతమయ్యారు. అందరికంటే కగిసో రబడ 3/39 గా ఆధిక్యంలో నిలిచాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 25, 2018, 13:05 [IST]
Other articles published on Jan 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X