న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

38 టెస్టుల్లో 38 మార్పులా!: కోహ్లీపై హర్భజన్ సింగ్ మండిపాటు

By Nageshwara Rao
38 changes in 38 Tests too much but if results coming, it’s alright: Harbhajan Singh

హైదరాబాద్: '38 టెస్టుల్లో 38 మార్పులా!' అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ విమర్శించాడు. సుదీర్ఘ పర్యటనలో భాగంగా కోహ్లీసేన ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే పర్యటనలో కామెంటేటర్‌గా విధులు నిర్వహిస్తోన్న హర్భజన్ సింగ్ తుది జట్టు మార్పుపై స్పందించాడు.

1
42377

విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఇప్పటి వరకు 38 టెస్టులు ఆడిగా, తొలి టెస్టుతో ఆడిన జట్టుతో ఇప్పటివరకు కోహ్లీ ఆడకపోవడం విశేషం. అంటే ప్రతి టెస్టులోనూ తుది జట్టులో మార్పులతో బరిలోకి దిగాడు. ప్రతి టెస్టు మ్యాచ్‌లోనూ ఆటగాళ్లను మార్చే విరాట్ కోహ్లీ వ్యూహాన్ని చాలా మంది అంగీకరించరు.

38 టెస్టుల్లో 38 మార్పులు

38 టెస్టుల్లో 38 మార్పులు

అయితే, ఈ మార్పుల వల్ల మంచి ఫలితాలు వస్తున్నంతవరకు ఫర్వాలేదని భజ్జీ అన్నాడు. "38 టెస్టుల్లో 38 మార్పులంటే వ్యక్తిగతంగా నాకైతే కొంచెం అతిగానే అనిపిస్తుంది. కానీ ప్రతి కెప్టెన్ భిన్నంగా ఆలోచిస్తాడు. ప్రతి జట్టు ప్రాధాన్యాలు కూడా వేరుగా ఉంటాయి. ఆ ప్రత్యేకతే కోహ్లీసేనకు కలిసొస్తుందేమో" అని భజ్జీ అన్నాడు.

తుది జట్టులో మార్పులు చేయడం వల్లే

తుది జట్టులో మార్పులు చేయడం వల్లే

"తుది జట్టులో మార్పులు చేయడం వల్లే ఈ ఏడాది సఫారీ గడ్డపై భారత జట్టు దాదాపు సిరీస్‌ విజయానికి చేరువైంది. ఇప్పుడు ఇంగ్లాండ్‌లో పరిస్థితులను మార్చింది. కెప్టెన్‌కు విశ్వాసం ఉండి, జట్టు మేనేజ్‌మెంట్‌ అంగీకరిస్తే, ఆటగాళ్లు ఒప్పుకుంటే మార్పులు గురించి మనం మాట్లాడే విషయాలు లెక్కలోకి రావు" అని భజ్జీ తెలిపాడు.

అద్భుతమైన ఫామ్‌లో కోహ్లీ

అద్భుతమైన ఫామ్‌లో కోహ్లీ

ప్రస్తుతం ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కెప్టెన్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ముగిసిన మూడు టెస్టుల్లో కోహ్లీ రెండు సెంచరీలు నమోదు చేశాడు. అంతేకాదు ఈ సిరీస్‌లో ఇప్పటి వరకూ 440 పరుగులు చేశాడు. తద్వారా ఇంగ్లాండ్ గడ్డ మీద ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా విరాట్ రికార్డు సృష్టించాడు.

 అజారుద్దీన్‌ను అధిగమించిన కోహ్లీ

అజారుద్దీన్‌ను అధిగమించిన కోహ్లీ

ఇప్పటి వరకూ ఈ రికార్డు అజారుద్దీన్ (426) పేరిట ఉంది. కోహ్లీ మరో ఆరు పరుగులు చేస్తే టెస్టుల్లో 6000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరడానికి ముందు కోహ్లీ టీమిండియా సహాయక బృందంలోని రఘు నేతృత్వంలో పిచ్‌ను తడిపి బ్యాటింగ్‌ సాధన చేశాడు. ఇది విరాట్‌ బ్యాటింగ్‌కు బాగా సహాయపడిందని భజ్జీ అభిప్రాయపడ్డాడు.

 విరాట్‌ కోహ్లీ చాలా తెలివైన ఆటగాడు

విరాట్‌ కోహ్లీ చాలా తెలివైన ఆటగాడు

"బంతి పడినప్పుడు విరాట్‌ కోహ్లీ తలను నిలిపి బంతులు వదిలేయడం కీలకం. ఇంగ్లాండ్‌లో బంతులు వదిలేస్తున్నామంటే పరుగులు చేస్తున్నట్టే లెక్క. విరాట్‌ కోహ్లీ చాలా తెలివైన ఆటగాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలో పర్యటించి బ్యాటింగ్‌ చేయడం చాలా సులువని అతనిలా ఎవరూ నిరూపించలేదు" అని భజ్జీ పేర్కొన్నాడు.

Story first published: Friday, August 24, 2018, 13:16 [IST]
Other articles published on Aug 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X