న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్ గెలవాలంటే!: కోహ్లీసేన చేయకూడని మూడు తప్పులివే

India vs Australia 2018-2019: 3 Mistakes India Should Avoid to Win Australian Test Series | Oneindia
3 mistakes India should avoid to win Australian Test series

హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఇప్పటివరకు ఒక్క టెస్టు సిరిస్‌ను గెలవలేదు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో టీమిండియా గత రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. 2003-04లో సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని టీమిండియా సిరీస్‌ని డ్రాగా ముగించగా ఆ తర్వాత 2003-04లో ధోని నాయకత్వంలో సిరీస్‌ని 1-2తో చేజార్చుకుంది.

<strong>భారత్ vs ఆసిస్: గత రికార్డులను ప్రస్తావించి భారత్ ఫేవరేట్ కాదన్న గిల్‌క్రిస్ట్</strong>భారత్ vs ఆసిస్: గత రికార్డులను ప్రస్తావించి భారత్ ఫేవరేట్ కాదన్న గిల్‌క్రిస్ట్

మళ్లీ ధోని నాయకత్వంలోని టీమిండియా 2014-15 ఆసీస్ పర్యటనలో 0-2తో ఓడిపోయింది. అయితే, ఈ పర్యటనలో విరాట్ కోహ్లీ ఏకంగా 4 సెంచరీలు సాధించినప్పటికీ, జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఇప్పుడు కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మళ్లీ ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది.

ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3టీ20లు, 4 టెస్టులు, 3వన్డేల సిరిస్ ఆడనుంది. ఇప్పటికే ముగిసిన మూడు టీ20ల సిరిస్‌ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేడికగా ప్రారంభం కానుంది. ఈసారి కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా చరిత్ర సృష్టించాలని ఊవిళ్లూరుతోంది.

మునుపటితో పోలిస్తే ఇప్పుడు భారత్ జట్టు మంచి సమతూకంతో ఉండటం, మరోవైపు డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్ లేకపోవడంతో ఆసీస్ జట్టు బలహీనంగా కనిపిస్తుండటతో.. కోహ్లీసేన కచ్చితంగా టెస్టు సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే, ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్టు సిరిస్‌ను గెలవాలంటే ఈ మూడు తప్పులను చేయకూడదు.

టెస్టు సిరిస్ గెలవాలంటే టీమిండియా చేయకూడని ఆ మూడు తప్పులేంటో చూద్దామా!

కేఎల్ రాహుల్‌ని ఓపెనర్‌గా బరిలోకి దింపకూడదు

కేఎల్ రాహుల్‌ని ఓపెనర్‌గా బరిలోకి దింపకూడదు

ఆసీస్ గడ్డపై టీమిండియాకు చక్కటి శుభారంభం లభించాలంటే టెస్టుల్లో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌ని పంపకపోవడమే మేలు. ఇటీవలి కాలంలో కేఎల్ రాహుల్ చాలా పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ప్రస్తుతం అతడి ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని కేఎల్ రాహుల్‌ని ఓపెనర్‌గా పంపకూడదు. అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగడం... త్వరగా వికెట్‌ను కోల్పోతే భారత్ ఒక్కసారిగా ఒత్తిడిలోకి వెళ్తోంది. ఇది ఆసీస్ బౌలర్లలో సైతం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కేఎల్ రాహుల్‌ని రెండో స్థానంలో బ్యాటింగ్‌కు పంపి, అతడి స్ధానంలో ఓపెనర్‌గా మురళీ విజయ్‌ వస్తే బాగుంటుంది. కౌంటీల్లో మురళీ విజయ్ చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. అతనికి తోడు వార్మప్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన షాను ఓపెనర్లుగా పంపితే భారత్‌ చక్కటి భాగస్వామ్యాలను నమోదు చేసే అవకాశం ఉంది.

బ్యాటింగ్‌లో దూకుడుగా ఉండకూడదు

బ్యాటింగ్‌లో దూకుడుగా ఉండకూడదు

ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా చేసిన తప్పిదాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇంగ్లాండ్ పర్యటనలో భారత ఆటగాళ్లు ఆఫ్‌స్టంప్‌ని వదిలి ఆడటాన్ని మనం చూశాం. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఆటగాళ్లు ఎంతో సహనంతో వ్యవహారించాలి. ముఖ్యంగా భారత ఓపెనర్లు పాత స్కూల్ బ్యాటింగ్‌ను మాత్రం ఆడకూడదు. టీ20 క్రికెట్‌తో పోలిస్తే, టెస్టు క్రికెట్‌లో సహనం అవసరం. క్రికెట్‌లో ఓ సామెత కూడా ఉంది. కొన్ని గంటలు బౌలర్లకు ఇస్తే... మిగిలిన రోజంతా నీదే. ఆసీస్ గడ్డపై టీమిండియా భారీ స్కోరు నమోదు చేయాలంటూ ఈ సూత్రాన్ని తప్పక పాటించాలి. ఆస్ట్రేలియా పిచ్‌లపై తొలి ఇన్నింగ్స్‌లోనే భారత్ భారీ పరుగులు చేసే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని టీమిండియా క్యాచ్-అప్ గేమ్ ఆడితే బాగుంటుంది.

ఆస్ట్రేలియా లోయర్-మిడిల్ ఆర్డర్‌పై సరైన ప్రణాళికలతో సాగాలి

ఆస్ట్రేలియా లోయర్-మిడిల్ ఆర్డర్‌పై సరైన ప్రణాళికలతో సాగాలి

ఇంగ్లీషు గడ్డపై భారత్ ఓటమికి ముఖ్య కారణం ఇంగ్లాండ్ లోయర్-మిడిల్ ఆర్డర్‌పై సరైన ప్రణాళికలను రచించకపోవడమే. ఇదే ఇంగ్లాండ్ విజయానికి కారణమైంది. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఈ తప్పిదాలను చేయకుండా జాగ్రత్త వహించాలి. ఆస్ట్రేలియా జట్టు విజయాల్లో టాపార్డర్ ఎంత కీలకమో, లోయర్-మిడిల్ ఆర్డర్ కూడా కీలకమే. బౌలర్లు సైతం ఆస్ట్రేలియాను గెలిపించిన సందర్భాలు అనేకం. అంతేకాదు లోయర్ బ్యాట్స్‌మెన్ భారత ఓటమికి అవసరమయ్యే పరుగులు చేయగలిగే సామర్థ్యం ఉంది.

డిసెంబర్ 6 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు

డిసెంబర్ 6 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈసారి కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా చరిత్ర సృష్టించాలని ఊవిళ్లూరుతోంది. మునుపటితో పోలిస్తే ఇప్పుడు భారత్ జట్టు మంచి సమతూకంతో ఉండటం, మరోవైపు డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్ లేకపోవడంతో ఆసీస్ జట్టు బలహీనంగా కనిపిస్తుండటతో.. కోహ్లీసేన కచ్చితంగా టెస్టు సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉంది.

Story first published: Thursday, November 29, 2018, 15:26 [IST]
Other articles published on Nov 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X