న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2011 World Cup: 'ధోనీ తీసుకున్న ఆ సాహసోపేత నిర్ణయం.. ఎంతో గొప్పదని ఇప్పుడు చరిత్ర చెపుతోంది'

2011 World Cup: Paddy Upton said It was a brave call by MS Dhoni to bat ahead of Yuvraj Singh

హైదరాబాద్: 2011, ఏప్రిల్‌ 2.. ఈ రోజును సగటు భారత క్రికెట్ అభిమాని ఎప్పటికీ మర్చిపోడు. ఎందుకంటే.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా రెండోసారి ముద్దాడింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన 275 పరుగుల లక్ష్యాన్ని 48.2 ఓవర్లలోనే ఛేదించి ప్రపంచ విజేతగా నిలిచింది. ఆ చరిత్రాత్మక ఘట్టం జరిగి నేటికి సరిగ్గా పదేళ్లు అయింది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లు ఆ మధుర స్మృతులను తలుచుకుంటున్నారు. టీమిండియా మాజీ కోచ్ ప్యాడీ ఆప్టన్ కూడా మహీ సాహసోపేత నిర్ణయం గురించి పంచుకున్నారు.

ఐదవ స్థానంలో బ్యాటింగ్‌

ఐదవ స్థానంలో బ్యాటింగ్‌

ప్రపంచకప్‌ ఫైనల్లో యువరాజ్ సింగ్‌ను కాదని ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌‌ ఆర్డర్‌‌లో ముందుకు వచ్చి సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడని ప్యాడీ ఆప్టన్ పేర్కొన్నారు. తాజాగా ఆప్టన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'ధోనీ నాయకత్వం సూపర్. మహీ మిస్టర్ కూల్. భారత క్రికెట్‌కి దొరికిన విలువైన ఆస్తి. మహీకి ఉండే ప్రశాంతత ఇతర ఆటగాళ్లను కూడా అంతే ప్రశాంతంగా ఉండేలా చేసేది. మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా.. అతడు కూల్‌గా నిర్ణయాలు తీసుకునేవాడు. అందుకు పెద్ద నిదర్శనం.. 2011 ప్రపంచకప్ ఫైనల్లో ఐదవ స్థానంలో అతను బ్యాటింగ్‌కి వెళ్లడమే' అని అన్నారు.

సూపర్ ఫామ్‌లో యూవీ

సూపర్ ఫామ్‌లో యూవీ

'నిజానికి మెగా టోర్నీ సమయంలో యువరాజ్ సింగ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అప్పటికే టోర్నీలో మెరుగైన ప్రదర్శనతో 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'‌ని కూడా ఖాయం చేసుకున్నాడు. ధోనీ ఆ ప్రపంచకప్‌ ఫైనల్ వరకూ పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ ఫైనల్లో యువీ కంటే ముందు బ్యాటింగ్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మురళీ ధరన్ ఆ సమయంలో బౌలింగ్ చేస్తుండంతో.. అతని బౌలింగ్‌లో ఆడిన అనుభవం తనకి ఉండటంతోనే యువీ కంటే ముందు బ్యాటింగ్‌కి వెళ్లాలనుకున్నాడు. మహీకి చీఫ్ కోచ్ గ్యారీ కిరెస్టన్ కూడా అభ్యంతరం చెప్పలేదు. యువీ కంటే ముందు తాను బ్యాటింగ్‌కి వెళ్తానని ధోనీ చెప్పగానే.. వెంటనే ఓకే అన్నాడు' అని ఆప్టన్ చెప్పారు.

సాహసోపేత నిర్ణయం

సాహసోపేత నిర్ణయం

'యువరాజ్ కంటే ముందు బ్యాటింగ్‌కి వెళ్లిన ధోనీ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఒత్తిడిని జయిస్తూ మ్యాచ్‌లను ధోనీ ముగించగలడని మాకు తెలుసు. కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న ఆ సాహసోపేత నిర్ణయం చాలా గొప్పదని ఇప్పుడు చరిత్ర చెప్తోంది' అని ప్యాడీ ఆప్టన్ చెప్పుకొచ్చారు. అయితే యువరాజ్ బ్యాటింగ్ ఆర్డర్‌ని మార్చడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మురళీ బౌలింగ్‌లో ఆడిన అనుభవం తనకి ఉండటంతోనే యువీ కంటే ముందు బ్యాటింగ్‌కి వెళ్లానని ధోనీ వివరణ ఇచ్చాడు. ఐపీఎల్‌లో చెన్నైకి ధోనీతో కలిసి మురళీ ఆడగా.. అతని నెట్స్‌లో చాలా సార్లు ఎదుర్కొన్నానని మహీ తెలిపాడు.

ఆదుకున్న గంభీర్

ఆదుకున్న గంభీర్

మొదటగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కెప్టెన్ మహేల జయవర్దనె (103 నాటౌట్: 88 బంతుల్లో 13x4) అజేయ సెంచరీ చేసాడు. భారత బౌలర్లలో యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో భారత్ త్వరగానే మూడు వికెట్లు కోల్పోయినా ఎంఎస్ ధోనీ (91 నాటౌట్: 79 బంతుల్లో 8x4, 2x6)తో కలిసి గౌతమ్ గంబీర్ (97: 122 బంతుల్లో 9x4)తో నాలుగో వికెట్‌కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో యువరాజ్ (21 నాటౌట్: 24 బంతుల్లో 2x4)తో కలిసి 48.2 ఓవర్లలోనే 277/4తో గెలుపు మహీ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఏబీ ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్.. రైనా, మ‌లింగ‌ల‌కు షాక్! కెప్టెన్ ఎవరంటే?

Story first published: Friday, April 2, 2021, 15:04 [IST]
Other articles published on Apr 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X