ఏబీ ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్.. రైనా, మలింగలకు షాక్! కెప్టెన్ ఎవరంటే?

హైదరాబాద్: గతకొంత కాలంగా క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్రకటిస్తున్నారు. ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. ఇక ఐపీఎల్ 2021కి దాదాపు వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ తన అత్యుత్తమ ఐపీఎల్ జట్టును ప్రకటించాడు.

రైనా, మలింగలకు షాక్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు ఆడుతున్న మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్.. 14వ సీజన్ మొదలయ్యే ముందు తన ఫేవరెట్ ఆల్‌టైమ్ ఐపీఎల్ లెవన్ టీమ్‌ను ప్రకటించాడు. అయితే ఇందులో అత్యధిక పరుగుల లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్న మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా, అత్యధిక వికెట్ల వీరుడు లసిత్ మలింగలకు మాత్రం చోటు దక్కకపోవడం విశేషం. ఐపీఎల్ నిబంధలు ప్రకారం తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లకు ఏబీ అవకాశం ఇచ్చాడు. బెన్ స్టోక్స్, రషీద్ ఖాన్, కగిసో రబడలకు చోటు కల్పించాడు. అయితే మరో స్థానం కోసం ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకున్నాడు.

నాలుగో స్థానంపై నో క్లారిటీ
ఏబీ ప్రకటించిన టీమ్‌కు కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీని ఎంపిక చేశాడు. ఇక ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. అయితే నాలుగో స్థానంలో ఎవరు ఉంటారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఆ స్థానంలో కేన్ విలియమ్స్‌న్, స్టీవ్ స్మిత్‌తో పాటు తన పేరును కూడా డివిలియర్స్ ప్రకటించుకున్నాడు. ఆల్‌రౌండర్ల కోటాలో బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజాలను ఎంపిక చేశాడు. పేస్ బాధ్యతలు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, కగిసో రబడలకు.. స్పిన్ బాధ్యతను రషీద్ ఖాన్, జడేజాలకు అప్పగించాడు.

ధోనీకే ఓటు
ఏబీ డివిలియర్స్ తన బెస్ట్ ఐపీఎల్ ఎలెవెన్ టీమ్ కెప్టెన్‌గా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి అత్యంత విజయవంతమన కెప్టెన్‌గా పేరు పొందిన రోహిత్ శర్మను కాదని ఎంఎస్ ధోనీకే ఓటు వేయడం ఇక్కడ విశేషం. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై వేదికగా సీజన్ తొలి మ్యచ్‌ను ఆడనుంది. తాజాగా ఏబీ ఆర్‌సీబీ జట్టుతో కలిశాడు.

ఏబీ డివిలియర్స్ ఆల్‌టైమ్ ఐపీఎల్ బెస్ట్ ఎలెవన్
వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్/ స్టీవ్ స్మిత్ / ఏబీ డివిలియర్స్, బెన్ స్టోక్స్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్, కెప్టెన్), రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, కగిసో రబడ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
కరోనాతో ఆస్పత్రిలో చేరిన సచిన్ టెండూల్కర్!!