For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత తొలిసారి: న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం

1st T20I: England beat New Zealand by 7 wickets in the teams first meeting after World Cup 2019 final

హైదరాబాద్: క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ మూడు వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో ఛేదించింది. దీంతో ఐదు టీ20ల సిరిస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

లక్ష్య చేధనలో ఇంగ్లాండ్ జట్టుకు జానీ బెయిర్‌ స్టో(35) మంచి ఆరంభాన్ని ఇవ్వగా, జేమ్స్‌ విన్సే(59; 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక, ఇయాన్ మోర్గాన్(34 నాటౌట్‌; 21 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఓపెనర్ మార్టిన్‌ గప్టిల్‌(2) నిరాశపరిచగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్క్ టేల‌ర్ 44 పరుగులతో ఫరవాలేదనిపించాడు.

చివర్లో రాస్‌ టేలర్‌(44; 35 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), డారిల్‌ మిచెల్‌(30 నాటౌట్‌; 17 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు)లు రాణించడంతో న్యూజిలాండ్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇరు జట్ల తలపడిన తర్వాత ఈ జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్‌ కావడం విశేషం.

లార్డ్స్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్ పైనల్లో ఇరు జట్ల స్కోర్లు సమం కాగా... ఆ తర్వాత సూపర్ ఓవర్‌ను ఆడించారు. అయితే, సూపర్ ఓవర్‌లో కూడా స్కోర్లు సమం కావడంతో బౌండరీ రూల్ ప్రకారం ఇంగ్లాండ్ జట్టుని విశ్వవిజేతగా ప్రకటించారు. అయితే, తాజా మ్యాచ్‌లో సూపర్ ఓవర్ లేకుండానే ఇంగ్లాండ్ విజయం సాధించింది.

Story first published: Friday, November 1, 2019, 12:57 [IST]
Other articles published on Nov 1, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+