న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని 10000: భారత్ తరుపున ఐదో ఆటగాడిగా అరుదైన ఘనత

India Vs Australia,1st ODI : MS Dhoni Catches 10000-Run Mark In ODI's | Oneindia Telugu
1st ODI: Legend Dhoni Breaches 10K Mark, Joins Tendulkar, Ganguly & Kohli in Exclusive Club

హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున మహేంద్ర సింగ్ ధోని వన్డేల్లో పది వేల పరుగులు పూర్తి చేశాడు. ఆస్ట్రేలియాతో శనివారం ప్రారంభమైన తొలి వన్డేలో రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో స్క్వేర్ లెగ్ దిశగా సింగిల్ తీసి ఈ మైలురాయిని అందుకున్నాడు.

మరో షాక్: అంబాసిడర్ హోదా నుంచి పాండ్యాను తప్పించిన జిల్లెట్మరో షాక్: అంబాసిడర్ హోదా నుంచి పాండ్యాను తప్పించిన జిల్లెట్

కెరీర్‌లో 334వ వన్డే ఆడుతున్న ధోని భారత్ తరఫున 10వేల పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా తరఫున ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), విరాట్ కోహ్లీ (10,235) 10వేల పరుగులు మైలురాయిని అందుకున్నారు.

10వేల పరుగుల మైలురాయిని అందుకున్న ధోని

నిజానికి గతేడాదే ధోని 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అయితే, అందులో 174 పరుగులు ఆసియా ఎలెవన్ తరఫున ఆడి చేసినవి కావడం విశేషం. 2007లో ఆఫ్రికా ఎలెవన్, ఆసియా ఎలెవన్ మధ్య జరిగిన ఆ టోర్నీలో మూడు వన్డేలాడిన ధోనీ 174 పరుగులు చేశాడు.

టీమిండియా తరుఫున ఐదో ఆటగాడిగా

దీంతో ధోని ఖాతాలో ఉన్న 10,173 నుంచి ఆ పరుగుల్ని మినహాయిస్తే, టీమిండియా తరుఫున ధోని చేసినవి 9,999 మాత్రమే కావడంతో గణాంకాలు మారాయి. గతేడాది స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో ధోని ఈ మైలురాయిని అందుకోవాల్సి ఉంది. విండీస్‌తో మూడు వన్డేల్లో మాత్రమే ధోనికి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది.

కేవలం ఒక్క పరుగు దూరంలో

దీంతో మూడు వన్డేల్లో ధోని 20, 7, 23 చొప్పున మాత్రమే పరుగులు చేశాడు. తిరువనంతపురం వేదికగా నవంబర్ 1న జరిగిన చివరి వన్డేలో పదివేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు ధోని కేవలం ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ధోనికి బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు.

కోహ్లీనే ఉద్దేశపూర్వంగా అడ్డుపడ్డాడని

కోహ్లీనే ఉద్దేశపూర్వంగా అడ్డుపడ్డాడని

ధోని 10వేల పరుగుల మైలురాయిని అందుకోనివ్వకుండా కోహ్లీనే ఉద్దేశపూర్వంగా అడ్డుపడ్డాడని అప్పట్లో ట్విట్టర్‌లో నెటిజన్లు మండిపడ్డారు. భారత గడ్డపై పూర్తి చేయాల్సిన పది వేల పరుగులను ఆస్ట్రేలియాలో పూర్తి చేశాడు. 72 రోజుల నిరీక్షణ, 9100 కి.మీ. ప్రయాణం (త్రివేండ్రం-సిడ్నీ)అనంతరం ధోనీ ఈ మైలురాయిని సాధించడాని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

1
43627
Story first published: Saturday, January 12, 2019, 14:16 [IST]
Other articles published on Jan 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X