న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

1997లో సరిగ్గా ఇదే రోజున పాక్‌ను చావు దెబ్బకొట్టిన దాదా

18th September 1997: Ganguly Fifer Derails Pakistan in Toronto

హైదరాబాద్: 1997లో సరిగ్గా ఇదే రోజు(సెప్టెంబర్‌ 18)న టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ తన కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో గంగూలీ(5/16)తో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌ను చావు దెబ్బకొట్టాడు. టొరంటో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పిచ్ విపరీతంగా బౌలింగ్‌కు సహకరించింది.

పంత్ మెడపై కత్తి.. రెండో టీ20 రాణిస్తే సరి లేదంటే అంతే: కోహ్లీపంత్ మెడపై కత్తి.. రెండో టీ20 రాణిస్తే సరి లేదంటే అంతే: కోహ్లీ

టీమిండియా బ్యాటింగ్

టీమిండియా బ్యాటింగ్

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను పాక్ బౌలర్లు అఖిబ్‌ జావెద్‌, అజార్‌ మహ్మద్‌, మహ్మద్‌ అక్రమ్‌ తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. రాహుల్ ద్రవిడ్‌ (25)తో కలిసి అజహరుద్దీన్‌(67) నాలుగో వికెట్‌కు 66 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

29 బంతుల్లో 32 పరుగులు

29 బంతుల్లో 32 పరుగులు

చివర్లో రాబిన్‌ సింగ్‌ 29 బంతుల్లో 32 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరు చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ సయీద్‌ అన్వర్‌ (22), షాహిద్‌ అఫ్రిది (44) రాణించడంతో తొలి వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం జోడించారు. దీంతో పాక్ అలవోకగా విజయం సాధిస్తుందని అంతా భావించారు.

గంగూలీ రాకతో మ్యాచ్ మొత్తం తారుమారు

గంగూలీ రాకతో మ్యాచ్ మొత్తం తారుమారు

అయితే, సౌరవ్ గంగూలీ రాకతో మ్యాచ్ మొత్తం తారుమారైంది. మీడియం పేస్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో గంగూలీ తన కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు 10-3-16-5 నమోదు చేశాడు. ఐజజ్‌ అహ్మద్‌, సలీమ్‌ మాలిక్‌, హసన్‌ రజా, మొయిన్‌ ఖాన్‌, జావెద్‌ను పెవిలియన్‌కు చేర్చాడు.

36.5 ఓవర్లకు 148 పరుగులు

36.5 ఓవర్లకు 148 పరుగులు

దీంతో పాకిస్థాన్ 36.5 ఓవర్లకు 148 పరుగులు చేసిన ఆలౌటైంది. దీంతో టీమిండియా 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సౌరవ్ గంగూలీ మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో 6 వన్డేల సిరీస్‌లో టీమిండియా 3-0తో ఆధిక్యంలో నిలిచింది.

Story first published: Wednesday, September 18, 2019, 19:43 [IST]
Other articles published on Sep 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X