న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Nikhat Zareen: తెలంగాణ బాక్సర్‌ 'పంచ్' అదిరిందిగా.. జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ గెలిచిన నిఖత్‌!

Nikhat zareen won gold medal in national womens elite boxing championship

హైదరాబాద్: తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ పవర్ 'పంచ్' అదిరింది. జాతీయ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నిఖత్‌ జరీన్‌ గోల్డ్ మెడల్ సాధించింది. హిస్సార్‌లో బుధవారం జరిగిన 52 కేజీల విభాగం ఫైనల్ బౌట్‌లో నిఖత్‌ 4-1తో హర్యానాకు చెందిన మీనాక్షిని చిత్తుచేసి నేషనల్ ఛాంపియన్‌గా నిలిచింది. హిస్సార్‌లో జరిగిన ఈ మెగా టోర్నీలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన యువ బాక్సర్‌ నిఖత్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. హేమాహేమీలను ఓడించిన నిఖత్‌పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.

Nikhat zareen won gold medal in national womens elite boxing championship

 Waqar Younis: తప్పు జరిగిపోయింది.. నన్ను క్షమించండి: పాకిస్థాన్‌ మాజీ ప్లేయర్ Waqar Younis: తప్పు జరిగిపోయింది.. నన్ను క్షమించండి: పాకిస్థాన్‌ మాజీ ప్లేయర్

జాతీయ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించడంతో నిఖత్‌ జరీన్‌ ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌కు నిఖత్‌ జరీన్‌ ఎంపికైంది. డిసెంబర్ మాసంలో టర్కీలో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ తన వెయిట్ కేటగిరిలో భారత్ తరపున బరిలోకి దిగనుంది. గోల్డ్ మెడల్ గెలవడం తనకు చాలా సంతోషంగా ఉందని మెడల్ అందుకున్న అనంతరం నిఖత్‌ జరీన్‌ తెలిపింది. ఇక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కూడా మెడల్ సాధించడమే తన లక్ష్యమని పేర్కొంది. అందుకోసం మరింత సాధన అవసరం అని నిఖత్‌ చెప్పుకొచ్చింది.

మంగళవారం జరిగిన 50-52 కేజీల సెమీ ఫైనల్‌ బౌట్‌లో నిఖత్‌ జరీన్ 5-0తో రాశి శర్మను చిత్తుచేసింది. సెమీ ఫైనల్‌లో కూడా నిఖత్‌ సత్తాచాటి అపుడే పతకం ఖాయం చేసింది. ఇక మరో తెలంగాణ క్రీడాకారిణి నిహారిక గోనెళ్ల పోరాటం మంగళవారమే ముగిసింది. 60-63 కేజీల సెమీస్‌లో నిహారిక 1-4తో జ్యోతి (రైల్వేస్‌) చేతిలో పరాజయం పాలైంది. సెమీస్‌లో ఓడిన నిహారికకు కాంస్య పతకం దక్కింది.

Story first published: Wednesday, October 27, 2021, 21:02 [IST]
Other articles published on Oct 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X