న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీవారిని దర్శించుకున్న 'వరల్డ్‌ చాంపియన్‌' పీవీ సింధు

World Badminton Champion PV Sindhu Visits Tirumala With Family

హైదరాబాద్: వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ పీవీ సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం సింధు తల్లిదండ్రులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి సింధు మొక్కులు చెల్లించుకున్నారు. సింధుతో పాటు చాముండేశ్వర్‌నాథ్‌ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం తల్లిదండ్రులతో కలిసి సింధు స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు.

ప్రపంజన్‌ మాయ.. తలైవాస్‌పై బెంగాల్ విజయంప్రపంజన్‌ మాయ.. తలైవాస్‌పై బెంగాల్ విజయం

వేదపండితుల ఆశీర్వచనం:

వేదపండితుల ఆశీర్వచనం:

అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో సింధుకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి పట్టు వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను ఆమెకు అందజేశారు. సింధును చూసేందుకు అక్కడ ఉన్న భక్తులు ప్రయత్నించారు. అయితే పటిష్ట భద్రత ఉండడంతో భక్తులకు నిరాశ ఎదురైంది. సింధు మరికాసేపట్లో హైదరాబాద్‌ బయల్దేరతారు.

గురువారం రాత్రి తిరుమలకు

గురువారం రాత్రి తిరుమలకు

సింధు శ్రీనివాసుడి దర్శనార్థం గురువారం తిరుమలకు చేరుకున్నారు. రాత్రి 8.50 గంటలకు జీఎంఆర్‌ అతిథి గృహానికి చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. అదే రాత్రి తిరుచానూరు పద్మావతి అమ్మవారిని సింధు దర్శించుకున్నారు. వడమాలపేట మండలం అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.

సింధు చరిత్ర:

సింధు చరిత్ర:

గత ఆదివారం జరిగిన ప్రపంచ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ (బీడబ్ల్యూఎఫ్‌) మహిళల సింగిల్స్‌ ఫైనల్లో పీవీ సింధు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచ ఐదో ర్యాంకర్‌ సింధు 21-7, 21-7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్‌)పై విజయం సాధించింది. సింధు కేవలం 38 నిమిషాల్లో ఒకుహారాను మట్టికరిపించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డుల్లోకి ఎక్కింది.

Story first published: Friday, August 30, 2019, 11:14 [IST]
Other articles published on Aug 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X