న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2021: బ్యాడ్మింటన్‌లో నిరాశే.. సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమి!!

Tokyo Olympics: Badminton Duo Chirag Shetty And Satwiksairaj Lost To No.1 Team Indonesia

టోక్యో: ఒలింపిక్స్ 2021లో మూడో రోజు భారత్‌కు కలిసిరావడం లేదు. ఇప్ప్పటికే ఫెన్సింగ్, టేబుల్‌ టెన్నిస్‌, ఆర్చ‌రీ ప్లేయర్స్ తీవ్రంగా నిరాశపరచగా.. ఈ జాబితాలో బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కూడా చేరారు. బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో భారత్ తరపున బరిలోకి దిగిన సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి ఓటమిపాలయ్యారు. భారత్‌పై ఇండోనేషియా జోడీ మార్కస్ గిడియాన్-కెవిన్ సుకముల్జో 21-13, 21-12 తేడాతో విజయం సాధించింది.

సోమవారం డబుల్స్ ఈవెంట్‌ గ్రూప్ ఎ స్టేజ్‌లో ఫేవరేట్లుగా బరిలోకి దిగిన సాత్విక్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి.. ప్రపంచ నంబర్ వన్ ఇండోనేషియా జోడికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఇండోనేషియా జోడి మొదటి గేమ్‌ను సునాయాసంగా గెలిచారు. రెండో గేమ్‌లో భారత జోడి మరింత చెత్త ప్రదర్శన చేసి మూల్యం చెలించుకుంది. రెండో రౌండ్‌లో ఓడినా భారత జట్టుకి ఇంకా నాకౌట్స్‌కి చేరేందుకు అవకాశం ఉంది. తర్వాతి మ్యాచ్‌లో బ్రిటీష్ జోడితో సాత్విక్‌-చిరాగ్ శెట్టి జోడి గెలిస్తే క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధిస్తారు.

Tokyo Olympics 2020: Domino’s Announces Special Gift For Mirabai Chanu | Oneindia Telugu

పీవీ సింధు తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. గ్రూప్ జె మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన క్సేనియా పొలికర్పోవాను ఆడుతూ, పాడుతూ మట్టికరిపించింది. ఏ మాత్రం చెమటోడ్చాల్సిన అవసరం రాలేదామెకు. కనీసం ప్రతిఘటించకుండానే చేతులెత్తేసింది పోలికర్పోవా. 21-7, 21-10 స్కోర్ తేడాతో సింధు ఆమెపై సునాయాస విజయాన్ని అందుకుంది. 28 నిమిషాల్లోనే మ్యాచ్ పూర్తయింది.

ఆర్చరీ బృంద పోటీల్లో భారత్‌ కథ ముగిసింది. పురుషుల బృంద పోటీల్లో అతాను దాస్‌, ప్రవీణ్‌ జాదవ్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌తో కూడిన జట్టు వెనుదిరిగింది. కొరియా చేతిలో 6-0 తేడాతో ఓటమి పాలైంది. టీమ్‌ఇండియా వరుసగా మూడు సెట్లలో తేలిపోవడం గమనార్హం. ఈ పోటీల్లో ఒక్కో సెట్లో ఆరు బాణాలు ఎక్కుపెట్టాలి. ఒక జట్టులో ముగ్గురు ఆటగాళ్లు ఉంటారు కాబట్టి.. ఒకరి తర్వాత ఒకరు ఒక్కో బాణం రెండుసార్లు గురి పెట్టాలి. మొదటి సెట్లో భారత్‌ 54 మాత్రమే చేయగా.. కొరియా 59తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో సెట్లో భారత్ 57 స్కోర్‌ చేసింది. కానీ కొరియా 59తో 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో సెట్లోనూ భారత్ 54 మాత్రమే చేయగా.. 56 స్కోర్‌ చేసిన కొరియా 6-0తో సెమీస్‌కు చేరుకుంది.

<strong>Tokyo Olympics 2021: కనీస పోటీఇవ్వకుండానే.. టీటీ రెండో రౌండ్​లో సుతీర్ధ ముఖర్జీ పరాజయం!!</strong>Tokyo Olympics 2021: కనీస పోటీఇవ్వకుండానే.. టీటీ రెండో రౌండ్​లో సుతీర్ధ ముఖర్జీ పరాజయం!!

Story first published: Monday, July 26, 2021, 11:51 [IST]
Other articles published on Jul 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X