న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2021: బ్యాడ్మింటన్​లో 'హ్యాట్రిక్'​ కొట్టేనా? స్వర్ణ ‘సింధూ’రమయ్యేనా?

Tokyo Olympics 2021: Badminton Preview; PV Sindhu Eyes Gold Medal, Others Target Breakthrough

హైదరాబాద్: హాకీ, షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్ తర్వాత ఒలింపిక్స్‌లో భారత్‌కు ఒకటి కంటే ఎక్కువ మెడల్స్ వచ్చిన ఈవెంట్ బ్యాడ్మింటన్. ఎన్నోఏళ్ల నిరీక్షణ తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ బ్రాంజ్ నెగ్గితే.. 2016 రియో గేమ్స్‌లో పివీ సింధు సిల్వర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్‌ జట్టు వరుసగా మూడో ఒలింపిక్స్‌లో పతకంతో హ్యాట్రిక్‌ కొడుతుందా? వరల్డ్ చాంపియన్‌ సింధు మరో పతకంతో మెరుస్తుందా? వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ప్రకాశ్‌ పదుకొణె తర్వాత కాంస్య పతకంతో సత్తాచాటిన భమిడిపాటి సాయిప్రణీత్‌ మురిపిస్తాడా? యువ డబుల్స్‌ క్రీడాకారులు సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌ శెట్టిల జోడీ సంచలనం సృష్టిస్తుందా? అనే ఆసక్తి భారత బ్యాడ్మింటన్ అభిమానుల్లో నెలకొంది.

 నలుగురికి టోక్యో బెర్త్‌‌లు..

నలుగురికి టోక్యో బెర్త్‌‌లు..

టోక్యో గేమ్స్‌లో భారత్ నుంచి నలుగురు షట్లర్లు మూడు ఈవెంట్లలో బరిలో నిలిచారు. పీవీ సింధు వరుసగా రెండో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌లో పోటీ పడుతోంది. పురుషుల సింగిల్స్‌లో బి. సాయి ప్రణీత్ ఫస్ట్ టైమ్ ఒలింపిక్స్ బరిలో నిలిచాడు. మరో తెలుగు షట్లర్ సాత్విక్ సాయిరాజ్.. పురుషుల డబుల్స్‌లో చిరాగ్ షెట్టితో కలిసి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మరి, టోక్యో‌లో మన రాకెట్లు మెరుస్తాయో లేదో చూడాలి. టోక్యో బరిలో ఉన్న భారత అథ్లెట్లలో కచ్చితంగా మెడల్ తెచ్చే వాళ్లలో తెలుగమ్మాయి పీవీ సింధు అందరి ఫేవరేట్. రియోలో సిల్వర్ నెగ్గిన తర్వాత ఆటతో పాటు స్టార్ డమ్‌లో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఈ హైదరాబాదీ ఈసారి గోల్డ్ మెడల్‌పై గురి పెట్టింది.

సింధుపైనే ఆశలు..

సింధుపైనే ఆశలు..

కరోనా కారణంగా ఏడాది కాలంగా చాలా టోర్నీలు ఆగిపోయినా.. పక్కా ప్లాన్‌తో ప్రిపరేషన్స్ కొనసాగించింది. నేషనల్ చీఫ్ కోచ్ గోపీచంద్‌ను కాదని కొరియా కోచ్ పార్క్ తయె సంగ్ గైడెన్స్‌లో ముందుకెళ్తోంది. అటాకింగ్‌లో తిరుగులేని సింధు డిఫెన్స్‌పై ఫోకస్ పెట్టింది. ఒలింపిక్ ఫీల్ కోసం హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మ్యాచ్ ప్రాక్టీస్ చేసింది. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో టోక్యో గేమ్స్ విలేజ్‌లో అడుగుపెట్టింది. 2019 వరల్డ్ చాంపియన్‌షిప్ తర్వాత మరో టైటిల్ నెగ్గలేకపోయినప్పటికీ పెద్ద ఈవెంట్లలో సింధు తన అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు సిద్దమవుతోంది. పైగా రియో ఫైనల్లో తనను ఓడించిన స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్ లేకపోవడం, ఈజీ డ్రాలో పోటీ ఆరో సీడ్ అయిన సింధుకు ప్లస్ పాయింట్ కానుంది. తన స్థాయికి తగ్గట్టు ఆడితే గోల్డ్ నెగ్గడం పెద్ద కష్టమేం కాబోదు.

ప్రణీత్ పట్టుకొస్తాడా?

ప్రణీత్ పట్టుకొస్తాడా?

పురుషుల్లో పతకం సాధించిన తొలి షట్లర్‌గా చరిత్ర సృష్టించే అవకాశం సాయి ప్రణీత్ ముంగిట ఉంది. పురుషుల సింగిల్స్‌లో 13వ సీడ్‌గా బరిలోకి దిగుతున్న ప్రణీత్ ఏదో ఒలింపిక్స్ ఆడుతున్నామని కాకుండా మెడల్ నెగ్గాలనే లక్ష్యంతో ఉన్నాడు. 28 ఏళ్ల ఈ తెలుగు ఆటగాడు 2019 ప్రపంచకప్ చాంపియన్‌షిప్స్‌లో బ్రాంజ్ గెలిచాడు. పెద్దగా అంచనాలు లేకపోవడం సాయికి ప్లస్ పాయింట్ కానుంది. 13వ సీడ్‌ సాయి ప్రణీత్‌ గ్రూపు దశను దాటడం సులువే. ప్రీ-క్వార్టర్స్‌లో 9వ ర్యాంకర్‌ లాంగ్‌ ఆగ్నస్‌(చైనీస్‌ తైపీ)తో సాయి తలపడొచ్చు. ఈ గండం దాటితే క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ కెంటొ మొమొట (జపాన్‌) రూపంలో సాయికి పెద్ద అడ్డంకే ఎదురుకానుంది. అయితే ఒలింపిక్స్‌ లాంటి విశ్వ వేదికపై ఎన్నో సంచనాలు నమోదవుతాయి. అందులో సాయి ప్రణీత్‌ ఉంటే ఆశ్చర్యపోనవసరం లేదు!

 డబుల్స్

డబుల్స్

ఒలింపిక్స్ మెన్స్ డబుల్స్‌లో పోటీ పడుతున్న మూడో జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి. అనుభవం లేకపోయినా అద్భుతమైన నైపుణ్యం అంతకుమించిన ఆత్మవిశ్వాసం ఈ ఇద్దరి సొంతం. రెండు మూడేళ్ల నుంచి ఈ ఇద్దరూ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యంగ్‌స్టర్స్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో సిల్వర్ నెగ్గి ఈ ఘనత సాధించిన భారత ఫస్ట్ జోడీగా నిలిచారు. డబుల్స్ స్పెషలిస్ట్ కోచ్ మథియాస్ బోయె సమక్షంలో ఒలింపిక్స్‌కు పక్కాగా ప్రిపేర్ అయ్యారు. అయితే టోక్యోలో వాళ్లకు టఫ్ డ్రా ఎదురైంది. వరల్డ్ నెంబర్ 1తో పాటు మూడో ర్యాంకర్ ఉన్న గ్రూప్‌లో సాత్విక్, చిరాగ్ పోటీ పడుతున్నారు. అయినా సెన్సేషనల్ ఆటకు మారుపేరైన ఈ యంగ్ ప్లేయర్స్ మెడల్ తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Story first published: Tuesday, July 20, 2021, 16:10 [IST]
Other articles published on Jul 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X