న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ఇంగ్లండ్‌లో సాధన చేయాలనుకోవడం.. నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం'

PV Sindhu says Training in UK during Coronavirus break one of my best moves

లండన్‌: కరోనా మహమ్మారి సమయంలో ఇంగ్లండ్‌కు వెళ్లి సాధన చేయాలనుకోవడం తాను తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో ఒకటని భారత బ్యాడ్మింటన్‌ స్టార్, ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు తెలిపారు. మెరుగైన శిక్షణ కోసం అక్టోబర్‌లో ఇంగ్లండ్‌ వెళ్లిన సింధు.. అక్కడే ఉండి తాజా సీజన్‌ కోసం సన్నద్ధమవుతున్నారు. ఈనెల 12 నుంచి జరుగనున్న థాయ్‌లాండ్‌ ఓపెన్‌తో సింధు మళ్లీ అంతర్జాతీయ టోర్నీ బరిలో దిగనున్నారు. థాయిలాండ్‌ ఓపెన్‌కు ఆమె లండన్‌ నుంచే వెళ్లనున్నారు.

తాజాగా పీవీ సింధు మాట్లాడుతూ... 'భారత్‌లో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంగ్లండ్‌కు వెళ్లి సాధన చేయాలనుకోవడం నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో ఒకటి. ఇక్కడ చలి మరీ ఎక్కువగా ఉండటం ఇబ్బందే కానీ.. ఎంతో తీవ్రతతో సాగిన శిక్షణ కార్యక్రమాలను బాగా ఆస్వాదించా. ఇప్పట్నుంచి వరుసగా టోర్నీలు ఆడతామని ఆశిస్తున్నా. సురక్షిత స్థితిలో ఉంటూనే.. కష్టపడుతూ, ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ ముందుకు సాగాలి. కరోనా వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే' అని అన్నారు.

లండన్‌లో కొత్త సంవత్సరం వేడుకలలో పాల్గొన్న ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు మరిన్ని విషయాలను కూడా పంచుకున్నారు. తన సాధన బాగా సాగుతోందని, టైటిల్ సాధించడంపైనే దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. సింధు చివరిసారిగా మార్చి 11 నుంచి 15 వరకు జరిగిన ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీలో తలపడ్డారు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న సింధుకు థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో అనుకూలమైన 'డ్రా' ఎదురైంది.

ప్రతీ ఏడాది క్రీడల క్యాలెండర్‌.. ఫలితాలు, రికార్డులు, అవార్డులు, పురస్కారాలతో ఫుల్ బిజీబిజీగా కనిపించేది. కానీ ఈసారి మాత్రం అలా లేదు. కరోనా మహమ్మారి రూపంలో కోరుకోని అతిథి మనముందుకు వచ్చింది. కంటికి కనిపించని వైరస్..‌ క్రీడల క్యాలెండర్‌ను కలవరపెట్టింది. 2021 మాత్రం సరికొత్త ఆశలతో స్వాగతం పలుకుతున్నది. బ్యాడ్మింటన్‌ షెడ్యూల్ ఇలా ఉంది.

బ్యాడ్మింటన్‌ షెడ్యూల్:

జనవరి 12-24 థాయ్‌లాండ్‌ ఓపెన్‌

మార్చి 17-21 ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌

మార్చి 31-ఏప్రిల్‌4 మలేషియా ఓపెన్‌

జూన్‌ 8-13 ఇండోనేషియా ఓపెన్‌

ఆగస్టు 24-29 హైదరాబాద్‌ ఓపెన్‌

సెప్టెంబర్‌ 21-26 విక్టర్‌ చైనా ఓపెన్‌

సెప్టెంబర్‌ 28-అక్టోబర్‌ 3 జపాన్‌ ఓపెన్‌

అక్టోబర్‌ 19-24 డెన్మార్క్‌ ఓపెన్‌

అక్టోబర్‌ 26-31 ఫ్రెంచ్‌ ఓపెన్‌

నవంబర్‌ 9-14 చైనా ఓపెన్‌

డిసెంబర్‌ 15-19 వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌

Year Ender 2020: 2020ని కరోనా కాటేసినా.. 2021 క్రీడా క్యాలెండర్‌ మాత్రం ఫుల్ బిజీ!!Year Ender 2020: 2020ని కరోనా కాటేసినా.. 2021 క్రీడా క్యాలెండర్‌ మాత్రం ఫుల్ బిజీ!!

Story first published: Saturday, January 2, 2021, 10:17 [IST]
Other articles published on Jan 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X