న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుబాయ్ సూపర్ సిరిస్ ఫైనల్స్: భారత్ నుంచి ఇద్దరే, ఆ ఇద్దరూ తెలుగువారే

By Nageshwara Rao
PV Sindhu and Kidambi Srikanth qualify for season-ending Dubai World Superseries Finals

హైదరాబాద్: దుబాయ్ వేదికగా జరిగే సూపర్ సిరిస్ ఫైనల్స్‌కు భారత్ స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు అర్హత సాధించారు. ఈ ఏడాది జరిగిన సూపర్‌ సిరీస్‌లలో ప్రదర్శన ఆధారంగా సింగిల్స్‌, డబుల్స్‌ విభాగాల్లో తొలి 8 స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.

మహిళల సింగిల్స్‌లో ప్రస్తుతం సింధు నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. దీంతో వీరిద్దరూ మాత్రమే ఈ టోర్నీకి అర్హత సాధించారు. అయితే దుబాయ్ సూపర్ సిరిస్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన ఇద్దరూ తెలుగు షట్లర్లే కావడం విశేషం.

కాగా, హెచ్ఎస్ ప్రణయ్, సైనా నెహ్వాల్‌ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకుల్లో 10వ స్ధానంలో ఉన్నారు. తాజాగా సింధు హాంకాంగ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే శ్రీకాంత్‌ ఈ ఏడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు గెలిచాడు. డిసెంబరు 13 నుంచి 17 వరకు దుబాయ్‌లో ఈ మెగా టోర్నీ జరుగుతుంది.

దుబాయ్ సూపర్ సిరిస్ ఫైనల్స్‌లో తలపడనున్న షట్లర్లు వీరే:
పురుషుల సింగిల్స్:
1. Son Wan Ho (South Korea)
2. Kidambi Srikanth (India)
3. Shi Yuqi (China)
4. Lee Chong Wei (Malaysia)
5. Chou Tien Chen (Chinese Taipei)
6. Ng Ka Long (Hong Kong)
7. Chen Long (China)
8. Viktor Axelsen (Denmark)


ఉమెన్స్ సింగిల్స్:
1. Akane Yamaguchi (Japan)
2. Tai Tzu Ying (Chinese Taipei)
3. Sung Ji Hyun (South Korea)
4. Pusarla V Sindhu (India)
5. Ratchanok Intanon (Thailand)
6. Carolina Marin (Spain)
7. He Bingjiao (China)
8. Nozomi Okuhara (Japan)


పురుషుల డబుల్స్:
1. Marcus Fernaldi Gideon/Kevin Sanjaya Sukamuljo (Indonesia)
2. Mathias Boe/Carsten Mogensen (Denmark)
3. Li Junhui/Liu Yuchen (China)
4. Liu Cheng/Zhang Nan (China)
5. Takeshi Kamura/Keigo Sonoda (Japan)
6. Mads Conrad-Petersen/Mads Pieler Kolding (Denmark)
7. Lee Jhe-Huei/Lee Yang (Chinese Taipei)
8. Takuro Hoki/Yugo Kobayashi (Japan)


మహిళల డబుల్స్:
1. Shiho Tanaka/Koharu Yonemoto (Japan)
2. Yuki Fukushima/Sayaka Hirota (Japan)
3. Chen Qingchen/Jia Yifan (China)
4. Christinna Pedersen/Kamilla Rytter Juhl (Denmark)
5. Chang Ye Na/Lee So Hee (South Korea)
6. Jung Kyung Eun/Shin Seung Chan (South Korea)
7. Yu Xiaohan/Huang Yaqiong (China)
8. Hsu Ya Ching/Wu Ti Jung (Chinese Taipei)


మిక్స్‌డ్ డబుల్స్:
1. Zheng Siwei/Chen Qingchen (China)
2. Lu Kai/Huang Yaqiong (China)
3. Tontowi Ahmad/Liliyana Natsir (Indonesia)
4. Tang Chun Man/Tse Ying Suet (Hong Kong)
5. Praveen Jordan/Debby Susanto (Indonesia)
6. Chris Adcock/Gabrielle Adcock (England)
7. Tan Kian Meng/Lai Pei Jing (Malaysia)
8. Kenta Kazuno/Ayane Kurihara (Japan)

What Things Sindhu Did Differently To Beat Okuhara This Time?

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 1, 2017, 10:34 [IST]
Other articles published on Dec 1, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X