న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పద్మభూషణ్‌కు పీవీ సింధు.. పద్మవిభూషణ్‌‌కు మేరీ కోమ్‌

Mary Kom Recommended for Padma Vibhushan, PV Sindhu for Padma Bhushan in All-Women Sports Ministry List

హైదరాబాద్: ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్‌ నెగ్గిన స్టార్ బాక్సర్ మేరీ కోమ్ పేరుని ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్‌ అవార్డుకు కేంద్ర క్రీడాశాఖ ప్రతిపాదించింది. మన దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌కు ఓ మహిళా అథ్లెట్ పేరుని ప్రతిపాదించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 2020 కోసం పద్మ అవార్డుల కోసం అర్హులైన వారి జాబితాను క్రీడాశాఖ ఇటీవల అవార్డుల కమిటీకి పంపింది.

<strong>పాండ్యా vs పాండ్యా: తలకు తగిలేలా బంతిని బాదాడు (వీడియో)</strong>పాండ్యా vs పాండ్యా: తలకు తగిలేలా బంతిని బాదాడు (వీడియో)

మహిళా అథ్లెట్లతో కూడిన జాబితా

మహిళా అథ్లెట్లతో కూడిన జాబితా

అయితే, మొదటిసారి మహిళా అథ్లెట్లతో కూడిన జాబితాను కేంద్ర క్రీడాశాఖ రూపొందించడం విశేషం. స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు పేరుని మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌ కోసం క్రీడాశాఖ ప్రతిపాదించింది. ఇటీవల జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సింధు స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

మేరీకోమ్‌ను 2006లో పద్మశ్రీ

మేరీకోమ్‌ను 2006లో పద్మశ్రీ

మేరీకోమ్‌ను 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్‌ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఈసారి ఆమెకు పద్మవిభూషణ్‌ పురస్కారం ఇస్తే ఈ ఘనత సాధించిన నాలుగో క్రీడాకారిణిగా మేరికోమ్‌ అరుదైన ఘనత సాధిస్తారు. అంతకముందు విశ్వనాథ్‌ ఆనంద్‌(2007), సచిన్‌ టెండూల్కర్(2008), ప్రముఖ పర్వతారోహకులు సర్‌ ఎడ్మండ్‌ హిల్లరీ మరణాంతరం 2008లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

2015లో పీవీ సింధుని పద్మశ్రీ

2015లో పీవీ సింధుని పద్మశ్రీ

ఇక, 2015లో కేంద్ర ప్రభుత్వం పీవీ సింధును పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. వాస్తవానికి పద్మభూషణ్‌ అవార్డు కోసం పీవీ సింధు పేరును 2017లో క్రీడాశాఖ ప్రతిపాందించినప్పటికీ... అవార్డుల కమిటీ ఎంపిక చేయలేదు. అయితే ఇటీవల సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను గెలవడంతో వచ్చే ఏడాది ఈ పురస్కారం అందుకోవడం గ్యారంటీ.

సింధు, మేరీకోమ్‌లతో పాటు మరో ఏడుగురు

సింధు, మేరీకోమ్‌లతో పాటు మరో ఏడుగురు

కాగా సింధు, మేరీకోమ్‌లతో పాటు మరో ఏడుగురు మహిళా అథ్లెట్ల పేర్లను కేంద్ర క్రీడాశాఖ పద్మ అవార్డులకు సిఫారసు చేసింది. ప్రముఖ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌, టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ మనికా బత్రా, క్రికెటర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, హాకీ కెప్టెన్‌ రాణి రాంఫాల్‌, మాజీ షూటర్‌ సుమ శిరూర్‌, పర్వతారోహకులు తాషి, నుంగ్షీ మాలిక్‌ పేర్లను పద్మశ్రీ పురస్కారాలకు ప్రతిపాదించింది.

Story first published: Tuesday, July 7, 2020, 15:27 [IST]
Other articles published on Jul 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X