న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ శుభారంభం.. క్వార్టర్‌ బెర్త్‌ ఖాయం

Kidambi Srikanth leads way as India thrash Kazakhstan 4-1 in Badminton Asia Team Championships

మనీలా: ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. ఏస్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ ముందుండి నడిపించాడు. మంగళవారం గ్రూప్‌ 'బి'లో కజకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4-1తో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. ముందుగా జరిగిన మూడు సింగిల్స్‌ పోటీల్లో శ్రీకాంత్‌, లక్ష్య సేన్‌, శుభాంకర్‌ డే అలవోక విజయాలు సాధించారు.

తడబడిన పాక్ జర్నలిస్ట్‌.. అదిరే పంచ్ ఇచ్చిన బాబర్ ఆజామ్ (వీడియో)!!తడబడిన పాక్ జర్నలిస్ట్‌.. అదిరే పంచ్ ఇచ్చిన బాబర్ ఆజామ్ (వీడియో)!!

తొలి మ్యాచ్‌ బరిలోకి దిగిన ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ కేవలం 23 నిమిషాల్లోనే ప్రత్యర్థిని ఓడించాడు. శ్రీకాంత్‌ 21-10, 21-7తో డిమిత్రి పనరిన్‌పై సునాయాస విజయం సాధించాడు. ఇక లక్ష్యసేన్‌ కూడా 21 నిమిషాల్లో ఆట ముగించాడు. లక్ష్యసేన్‌ 21-13, 21-8తో అర్తుర నియజోవ్‌పై గెలుపొందాడు. శుభాంకర్‌ డే 21-11, 21-5తో కైత్‌మురత్‌ కుల్మతోవ్‌పై గెలిచేందుకు 26 నిమిషాలే పట్టింది.

డబుల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్‌-చిరాగ్‌ షెట్టి జోడీ 21-18, 16-21, 19-21తో నియజోవ్‌-పనరిన్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే చివరగా జరిగిన మరో డబుల్స్‌ మ్యాచ్‌లో అర్జున్‌-ధ్రువ్‌ కపిల ద్వయం 21-14, 21-8తో నికిటా బార్జిన్‌- కైత్‌మురాత్‌ కుల్మటోవ్‌పై గెలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత సాయిప్రణీత్‌ మంగళవారం బరిలోకి దిగలేదు.

గురువారం జరిగే తమ తదుపరి లీగ్‌ మ్యాచ్‌లో మలేసియాతో భారత్‌ ఆడుతుంది. ఒక్కో గ్రూప్‌ నుంచి రెండేసి జట్లు క్వార్టర్స్‌ చేరతాయి. కరోనా వైరస్‌ భయంతో భారత మహిళల జట్టు టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, February 12, 2020, 8:22 [IST]
Other articles published on Feb 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X