న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండోనేషియా ఓపెన్.. సెమీఫైనల్లో సింధు

Indonesia Open 2019: PV Sindhu thrashing Nozomi Okuhara enters Semi finals


భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో దూసుకుపోతోంది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేస్తున్న సింధు.. సెమీస్‌లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో ఐదో సీడ్‌ సింధు 21-14, 21-7 తేడాతో మరో స్టార్ ప్లేయర్ నొజోమి ఒకుహారా (జపాన్‌)పై వరుస సెట్లలో విజయం సాధించింది. కేవలం 44 నిమిషాల్లోనే సింధు ఈ మ్యాచ్ సొంతం చేసుకుంది.

ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్ లోగో ఆవిష్కరణప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్ లోగో ఆవిష్కరణ

మ్యాచ్ తొలి నుంచే సింధు ఒకుహారాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్‌లో 5-5తో కొంత పోటీనిచ్చిన ఒకుహారా.. రెండో సెట్‌లో పూర్తిగా తేలిపోయింది. ఇక శనివారం జరిగే సెమీస్‌లో చైనా షట్లర్, రెండో సీడ్ చెన్ యుఫీతో సింధు తలపడనుంది. ఒకుహారా, సింధు 15 సార్లు తలపడగా.. ఏడు సార్లు ఒకుహారా, ఎనమిది సార్లు సింధు గెలిచింది.

గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ మ్యాచ్‌లో సింధు 21-14, 17-21, 21-11 తేడాతో మియా బ్లిచ్‌ఫెల్ట్‌ (డెన్మార్క్‌)పై విజయం సాధించింది. 62 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించి మ్యాచ్ కైవసం చేసుకుంది. గురువారమే జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో హైదరాబాదీ ప్లేయర్, 8వ సీడ్ శ్రీకాంత్‌కు పరాజయం ఎదురైంది. హాంకాంగ్‌కు చెందిన లాంగ్ అంగూస్ చేతిలో 17-21, 19-21 తేడాతో వరుస గేమ్‌ల్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తొలి గేమ్‌ను నాలుగు పాయింట్ల తేడాతో కోల్పోయినా.. రెండో గేమ్‌ను కాపాడుకునేందుకు వచ్చిన అవకాశాన్ని శ్రీకాంత్ చేజార్చున్నాడు. ఇక చివర్లో ప్రత్యర్థికి రెండు గేమ్ పాయింట్లను ఇచ్చి ఓడిపోయాడు.

Story first published: Friday, July 19, 2019, 19:00 [IST]
Other articles published on Jul 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X