న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్ చాంపియన్‌షిప్‌: 36 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సాయి ప్రణీత్

B Sai Praneeth creates history, becomes first Indian male shuttler to win World Championships medal in 36 years

హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు.. పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్ సెమీఫైనల్లో అడుగుపెట్టారు. ఫలితంగా 36 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్‌లో పతకం నెగ్గని లోటును తీరుస్తూ సాయి ప్రణీత్ కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేశాడు.

శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో వరల్డ్‌ నంబర్‌ 19 ర్యాంకర్ సాయి ప్రణీత్ ప్రణీత్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది ఆరంభంలో స్విస్ ఓపెన్ రన్నరప్‌గా నిలిచిన సాయి ప్రణీత్.. క్వార్టర్‌ఫైనల్లో తనకంటే మెరుగైన ఇండోనేషియా క్రీడాకారుడు జొనాథన్‌ క్రిష్టీపై 24-22, 21-14తో గెలుపొందాడు.

51 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో

51 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో

51 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో అద్భుతంగా సాగింది. తొలి గేమ్‌లో 8-4తో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణీత్.. ఆ తర్వాత కాస్త వెనుకబడ్డాడు. ప్రత్యర్థి పుంజుకోవడంతో స్కోరు 10-10 వద్ద సమమైంది. ఒక దశలో 20-19తో ప్రణీత్ నిలిచినా... జొనాథన్‌ కూడా పోరాడటంతో 22-22 వరకు పాయింట్లు సమమవుతూ వెళ్లాయి.

ప్రణీత్ కొట్టిన బలమైన షాట్‌ను

ప్రణీత్ కొట్టిన బలమైన షాట్‌ను

ఓ చక్కటి షాట్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకోవాలని భావించినా క్రిస్టీ అంతే అద్భుతంగా దాన్ని రిటర్న్ చేశాడు. అయితే ప్రణీత్ కొట్టిన బలమైన షాట్‌ను రిటర్న్ చేసే క్రమంలో క్రిస్టి నెట్ వద్ద తడబడ్డాడు. ఆ సమయంలో క్రాస్‌కోర్ట్ షాట్ ద్వారా వరుసగా రెండు పాయింట్లు సాధించిన ప్రణీత్ గేమ్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

రెండో గేమ్‌లో ప్రత్యర్థికి ఏమాత్రం

రెండో గేమ్‌లో ప్రత్యర్థికి ఏమాత్రం

రెండో గేమ్‌లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని ప్రణీత్ 7-1, 11-3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. వరుస పాయింట్లతో హోరెత్తించాడు. ఆ తర్వాత క్రిస్టీ తేరుకొని దగ్గరకు వచ్చినా సాయి ప్రణీత్ మాత్రం ఎలాంటి తడబాటుకు లోను కాకుండా 21-14తో రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

గత 36 ఏళ్లలో ఇదే మొదటిసారి

గత 36 ఏళ్లలో ఇదే మొదటిసారి

గత 36 ఏళ్లలో ఒక భారత షట్లర్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సెమీఫైనల్లో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. అంతకముందు 1983లో ప్రకాశ్‌ పదుకొనె ఈ మెగా ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించాడు. మ్యాచ్ అనంతరం సాయి ప్రణీత్ మాట్లాడుతూ "చాలా ఆనందంగా ఉంది. ఈ విజయాన్ని మాటల్లో వర్ణించలేను. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గోపీచంద్ సర్ అటాక్ చేయకు.. రిథమ్ మార్చు అని సూచించారు. అది చక్కటి ఫలితాన్నిచ్చింది" అని అన్నాడు.

Story first published: Saturday, August 24, 2019, 8:14 [IST]
Other articles published on Aug 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X