న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 నిమిషాల్లోనే టికెట్లన్నీ అయిపోయాయి!: చరిత్ర సృష్టించనున్న నాదల్ vs ఫెదరర్!

Gone in under 10 minutes! 48,000 Nadal Vs Federer tickets, set to break the attendance record for a tennis match


హైదరాబాద్: టెన్నిస్ దిగ్గజాలు రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్‌ల మధ్య మ్యాచ్ అంటే అభిమానుల్లో ఉన్న ఆసక్తివేరు. తాజాగా వీరిద్దరి మధ్య ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ని నిర్వహించాలని దక్షిణాఫ్రికా భావించింది. ఈ మ్యాచ్‌కి సంబంధించి సుమారు 48,000 టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచింది.

ఇంకేముంది విషయం తెలిసిన టెన్నిస్ అభిమానులు కేవలం 10 నిమిషాల్లోనే మొత్తం టికెట్లను కొనేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌కి కేప్ టౌన్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. 2010 ఫిఫా వరల్డ్‌కప్ కోసం ఈ కేప్ టౌన్ స్టేడియాన్ని నిర్మించారు.

తనతో చేతులు కలపాలని పిలుపు: రోహిత్ శర్మ కొత్త సంకల్పం!తనతో చేతులు కలపాలని పిలుపు: రోహిత్ శర్మ కొత్త సంకల్పం!

ఓ సరికొత్త రికార్డు

ఓ సరికొత్త రికార్డు

ఈ మ్యాచ్ వీక్షణపరంగా ఓ సరికొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. 2010లో బ్రస్సెల్స్ వేదికగా కిమ్ క్లిజ్స్టర్స్, సెరెనా విలియమ్స్‌ల మధ్య జరిగిన ఓ టెన్నిస్ మ్యాచ్‌ని 35,681 మంది హాజరయ్యారు. ఇప్పుడు ఆ రికార్డుని రోజర్ ఫెదరర్-రఫెల్ నాదల్‌ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ బద్దలు కొట్టనుంది.

టికెట్లను కొనుగోలు చేసేందుకు

టికెట్లను కొనుగోలు చేసేందుకు

ఫెదరర్-నాదల్ మ్యాచ్‌కి సంబంధించి టికెట్లను కొనుగోలు చేసేందుకు గాను ఆన్ లైన్‌తో పాటు ప్రత్యేకంగా ఔట్ లెట్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. రోజర్ ఫెదరర్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జనానీ హండల్ మాట్లాడుతూ "టికెట్ అమ్మకాలు మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. మద్దతు ఇచ్చినందుకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు" తెలిపారు.

ఒక్కొక్కరికి ఆరు టికెట్లు మాత్రమే

ఒక్కొక్కరికి ఆరు టికెట్లు మాత్రమే

ఒక్కో అభిమాని కేవలం ఆరు టికెట్లు మాత్రమే కొనుగోలు చేసే విధంగా నిబంధన విధించారు. ఇక, టికెట్ ధరలు ($10 to 130/9 to 119 euros) నిర్ణయించారు. ఫిబ్రవరి 7న ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ని నిర్వహించనున్నారు. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌కి అభిమానుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడంతో గ్యాలరీలో ప్రత్యేకంగా అదనపు స్టాండ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

రెండో స్థానంలో రఫెల్ నాదల్

రెండో స్థానంలో రఫెల్ నాదల్

ప్రస్తుతం టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ రెండో స్థానంలో కొనసాగుతుండగా... రోజర్ ఫెదరర్ మూడో ర్యాంకులో ఉన్నాడు. ఇక, సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Thursday, September 5, 2019, 12:10 [IST]
Other articles published on Sep 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X