22 ఏళ్ల క్రికెటర్.. 29 ఏళ్ల యాంకర్! ఏందీ ముచ్చట?
క్రికెట్ స్టేడియంలో సిక్సర్లతో విరుచుకుపడే ఢిల్లీ క్యాపిటల్స్ యువ సెన్సేషన్ సమీర్ రిజ్వీకి సంబంధించి ఓ సంచలన వార్త హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ 22 ఏళ్ల యువ ఆటగాడు ప్రముఖ ఇండో-కెనడియన్ స్పోర్ట్స్ యాంకర్ యెషా సాగర్‌తో ప్రేమాయణంలో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని, ముఖ్యంగా క్రికెట్ వర్గాల్లో వీరి రిలేషన్‌షిప్‌పై రకరకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
యూపీ టీ20 లీగ్ నుంచి మొదలైన పరిచయం
వీరిద్దరి మధ్య బంధం గతేడాది జరిగిన యూపీ టీ20 లీగ్ సమయంలో చిగురించినట్లు సమాచారం. ఆ టోర్నమెంట్‌లో సమీర్ రిజ్వీ తన అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించగా.. యెషా సాగర్ అక్కడ ప్రజెంటేటర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని.. అది కాస్తా ప్రేమగా మారిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్ జరుగుతున్న తరుణంలో ఈ వార్తలు మరోసారి గుప్పుమన్నాయి.

వయస్సు తేడాపై నెటిజన్ల చర్చ
వీరి రిలేషన్‌పై ప్రధానంగా చర్చ జరుగుతున్న అంశం వారి వయస్సు. సమీర్ రిజ్వీ వయస్సు ప్రస్తుతం 22 ఏళ్లు కాగా.. యెషా సాగర్‌కు 29 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య ఏడేళ్ల వయస్సు తేడా ఉంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు "ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు" అని మద్దతు ఇస్తుంటే, మరికొందరు మాత్రం ఈ జంటపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీల విషయంలో ఇలాంటి వయస్సు వ్యత్యాసాలు కొత్తేమీ కాదని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
ప్రముఖ ప్రజెంటేటర్‌గా యెషా సాగర్
యెషా సాగర్ కేవలం యాంకర్ మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో కూడా పెద్ద సెలబ్రిటీ. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తన గ్లామర్, స్పోర్ట్స్ నాలెడ్జ్‌తో గ్లోబల్ టీ20 కెనడా, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ వంటి అంతర్జాతీయ లీగ్స్‌లో ప్రజెంటేటర్‌గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సమీర్ రిజ్వీతో ఆమె పేరు ముడిపడటంతో ఆమె గురించి సెర్చ్ చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది.
స్పందించని సమీర్, యెషా
అయితే ఈ డేటింగ్ రూమర్లపై సమీర్ రిజ్వీ గానీ, యెషా సాగర్ గానీ ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. కేవలం సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు, వారిద్దరి సన్నిహిత ఫోటోలు, వారు ఒకరి పోస్టులకు మరొకరు చేసుకునే కామెంట్లను బట్టే అభిమానులు ఓ అంచనాకు వస్తున్నారు. వీరిద్దరూ తమ బంధాన్ని అధికారికంగా ధ్రువీకరిస్తారా లేక ఇవి కేవలం రూమర్లుగానే మిగిలిపోతాయా అనేది వేచి చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

