న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెంచ్ ఓపెన్ 2018: క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన జ్వెరెవ్

Alexander Zverev beats Karen Khachanov in five-set thriller at French Open

హైదరాబాద్: మంచి భవిష్యత్తున్న ఆటగాడిగా భారీ అంచనాలున్న జర్మనీ యువ కెరటం అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని చేజిక్కుంచుకుని కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ నాలుగో రౌండ్లో రెండో సీడ్‌ జ్వెరెవ్‌ 4-6, 7-6 (7-4), 2-6, 6-3, 6-3తో కరెన్‌ కచనోవ్‌ (రష్యా)ను ఓడించాడు.

పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ మూడోర్యాంకర్, రెండోసీడ్ జ్వెరేవ్ 4-6, 7-6 (7/4), 2-6, 6-3, 6-3తో ప్రపంచ 38వ ర్యాంకర్ కారెన్ కచనోవ్ (రష్యా)పై గెలిచి క్వార్టర్స్ కలను నెరవేర్చుకున్నాడు. ఈ టోర్నీలో జ్వెరేవ్ ఆడిన మూడో ఐదు సెట్ల మ్యాచ్ కాగా, ప్రిక్వార్టర్స్‌లో ఓడటం కచనోవ్‌కు ఇది వరుసగా రెండోసారి.

కీలక దశలో రెండు బ్రేక్ పాయింట్లను కాపాడుకున్న జ్వెరేవ్ .. అద్భుతమైన ఏస్‌తో సెట్‌ను మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే కచనోవ్ మూడుసెట్ పాయింట్లను వృథా చేసుకోవడంతో పాటు ఐదో బ్రేక్ పాయింట్‌ను చేజేతులా జారవిడుచుకుని ప్రత్యర్థికి అవకాశం ఇచ్చాడు. కచనోవ్ కొట్టిన షాట్ రెండోసారి లైన్ బయటకు వెళ్లడంతో జర్మన్ ఊపిరి పీల్చుకున్నాడు. కానీ మూడోసారి అదే తరహాలో షాట్ కొట్టి సెట్‌ను ముగించాడు. రెండోసెట్ ముగింపులో మారథాన్‌లా సాగిన సర్వీస్‌ను జ్వెరేవ్ నిలబెట్టుకోలేకపోయాడు.

21 ఏళ్ల జ్వెరెవ్‌ మ్యాచ్‌లో మొత్తం 63 విన్నర్లు, 17 ఏస్‌లు కొట్టాడు. క్వార్టర్‌ఫైనల్లో అతడు డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)తో తలపడతాడు. ప్రిక్వార్టర్స్‌లో థీమ్‌ 6-2, 6-0, 5-7, 6-4తో జపాన్‌ ఆటగాడు నిషికోరిని మట్టికరిపించాడు. పూర్వవైభవం కోసం తపిస్తోన్న మాజీ నంబర్‌వన్‌ జకోవిచ్‌ (సెర్బియా) కూడా క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. నాలుగో రౌండ్లో అతడు 6-3, 6-4, 6-2తో ఫెర్నాండో వెర్దాస్కో (స్పెయిన్‌)పై నెగ్గాడు. ఓవరాల్‌గా కమ్‌బ్యాక్ కింగ్‌గా పేరొందిన జ్వెరేవ్ .. 1937 తర్వాత ఫ్రెంచ్ టైటిల్ గెలిచిన తొలి జర్మన్ ఆటగాడిగా రికార్డులకెక్కాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

Story first published: Monday, June 4, 2018, 10:47 [IST]
Other articles published on Jun 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X