ట్రిపుల్ ఆక్సెల్: తొలి అమెరికన్‌గా చరిత్ర సృష్టించిన మిరాయి నగసు

Posted By:
Winter Olympics: Mirai Nagasu Lands Triple Axel in Team Event

హైదరాబాద్: వింటర్ ఒలింపిక్స్‌లో ట్రిపుల్ ఆక్సెల్ ఫీట్ చేసిన మొట్టమొదటి అమెరికా మహిళగా మిరాయి నగసు అరుదైన ఘనత సాధించింది. 23వ వింటర్ ఒలింపిక్స్‌కు దక్షిణకొరియాలోని ప్యాంగ్ చాంగ్ నగరం ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఒలింపిక్స్‌లో మొత్తం 15 క్రీడల్లో 102 ఈవెంట్లలో నిర్వాహకులు పోటీలు నిర్వహిస్తున్నారు.

ఈ గేమ్స్‌లో ఐస్ హాకీ, ఆల్పైన స్కీయింగ్, బయోథ్లాన్, బాబ్ స్లీగీ, క్రాస్ కంట్రీ స్కీయింగ్, కర్లింగ్, ఫిగర్ స్కేటింగ్, ఫ్రీ స్టయిల్ స్కేటింగ్, లూగే, నోరాడిక్ కంబైన్డ్, స్పీడ్ స్కేటింగ్, స్కెలిటన్, స్కీజంపింగ్, స్నోబోర్డింగ్ ఉన్నాయి. ఫిబ్రవరి 9 నుంచి 25 వరకూ జరిగే ఈ వింటర్ ఒలింపిక్స్‌లో 92 దేశాలకు చెందిన 3వేల మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు.

ముఖ్యంగా శీతాకాల ఒలింపిక్స్‌లో చెప్పుకోదగ్గ వాటిల్లో ఫ్రీ స్టయిల్ స్కేటింగ్ ఒకటి. ఈ ఈవెంట్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సోమవారం జరిగిన మహిళల ఫ్రీ స్టయిల్ స్కేటింగ్‌లో అమెరికాకు చెందిన మిరాయి నగసు అద్భుతమైన ఫీట్ చేసింది.

కాలిఫోర్నియాలోని మోంటిబెల్లోకు చెందిన 24 ఏళ్ల మిరాయి నగసు కేవలం 21 సెకన్లలో ట్రిపుల్ ఆక్సెల్ ఫీట్ చేసిన ప్రేక్షకులను కట్టిపడేసింది. చెంగన్ఉంగ్ ఐస్ ఎరీనాలో జరిగిన ఈ పోటీలో మిరాయి నగసు చేసిన ఫీట్‌కు స్టేడియంలో అభిమానులు మొత్తం లేచి నిలబడి చప్పట్లతో ఆమెను అభినందించారు.

Mirai Nagasu

అంతేకాదు ఈ ఫీట్ చేసినందుకు గాను మిరాయి నగసుకి 137.53 స్కోరు వచ్చింది. ఈ ఒలింపిక్స్‌లో మిరాయి నగసుతో పాటు జపాన్‌కు చెందిన మిడోరి, మావో అసదాలు ఈ ఫీట్‌ను చేసిన వారిలో ఉన్నారు. ఈ ఈవెంట్‌లో తొలుత కెనడా మహిళలు ప్రదర్శన ఇవ్వగా, ఆ తర్వాత రష్యా, అమెరికాకు చెందిన వారు పోటీ పడ్డారు.

ఈ వింటర్ ఒలింపిక్స్‌లో ఐస్ డ్యాన్స్ ప్రీ స్కేటింగ్ ఈవెంట్ ఇంకా జరగాల్సి ఉంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 12, 2018, 16:35 [IST]
Other articles published on Feb 12, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి