న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీడియో: పీవీ సింధు ఆడిన విన్నింగ్ షాట్‌ ఇలా అద్భుతంగా ఉంటది..!

Tokyo Olympics 2020: Watch PV Sindhu winning shot in this video

టోక్యో: జపాన్ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న ఒలింపిక్స్‌లో ఏడో రోజు భారత్.. తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఊహించినట్టే- భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. పతకం దిశగా దూసుకెళ్తోన్నారు. ఈ ప్రస్థానంలో ఆమెకు ఎదురు లేకుండా పోయింది. తిరుగులేని విజయాలను అందుకుంటోన్నారు. పెద్దగా శ్రమించాల్సిన అవసరమూ రాలేదు. జపాన్ కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 10:15 నిమిషాలకు జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో ఏకపక్ష విజయాన్ని సాధించారు. క్లీన్ విక్టరీని అందుకున్నారు.

డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌‌ఫెల్డ్‌పై 21-15, 21-13 వరుస సెట్ల తేడాతో గెలుపొందారు. ఖచ్చితంగా పతకాన్ని ఆశించే ఈ ఈవెంట్‌లో పీవీ సింధు.. అంచనాలకు అనుగుణంగా రాణిస్తోన్నారు. ఎప్పట్లాగే తనకు అలవాటైన రీతిలో బ్యాడ్మింటన్‌లో అదరగొడుతున్నారు. అలవోకగా విజయాలను సాధిస్తూ పతకం వైపు దూసుకెళ్తోన్నారు. తన ఫామ్‌కు ఎదురులేదని మరోసారి నిరూపించుకున్నారు. ప్రీ క్వార్టర్ ‌ఫైనల్స్‌ తొలి సెట్ ప్రారంభం నుంచే సింధు దూకుడు కొనసాగింది. 4-2తో ఆధిక్యతతో సెట్‌ను ప్రారంభించారు.

ఏ దశలోనూ మ్యాచ్‌పై ఆధిక్యతను ప్రదర్శించే అవకాశాన్ని తన ప్రత్యర్థికి ఇవ్వలేదు. అన్ని రౌండ్లపైనా పట్టు బిగించారు. తన ఆధిపత్యాన్ని చేజార్చుకోలేదు. ఖచ్చితమైన షాట్లతో డెన్మార్క్ ప్రత్యర్థిని బెంబేలెత్తించారు. అద్భుతమైన ర్యాలీలను సంధించారు. తొలి సెట్ రెండో భాగంలో డానిష్ ప్లేయర్ కొంత ప్రతిఘటించారు. ఒక దశలో పీవీ సింధుపై 13-15 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. అక్కడి నుంచి సింధు డ్రాప్ షాట్లతో విరుచుకుపడ్డారు. మియా 15 వద్దే ఆగిపోయిందంటే- పీవీ సింధు ఏ స్థాయిలో చెలరేగారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి రౌండ్‌లోనూ రెండేసి చొప్పున పాయింట్లను సాధించుకుంటూ వెళ్లారు.

బోనస్ పాయింట్‌తో ఈ సెట్‌ను 21-15 తేడాతో గెలుచుకున్నారు. రెండో సెట్‌లో కూడా ఇదే ఆధిపత్యం కొనసాగింది. పీవీ సింధు నాలుగు పాయింట్లను సాధించేంత వరకు మియా ఖాతా తెరవలేకపోయారు. ఈ సెట్‌ను 21-13 తేడాతో సునాయాసంగా గెలుచుకున్నారు. ఈ విజయంతో పీవీ సింధు క్వార్టర్ ‌ఫైనల్స్‌లో అడుగు పెట్టారు. ఊహించినట్టే- తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో ఆమె అలవోక విజయాలను సాధిస్తూ పతకం వైపు దూసుకెళ్తోన్నారు. ఈ ప్రస్థానంలో మరో క్లీన్ విక్టరీని అందుకున్నారు.

మ్యాచ్‌ను వశం చేసుకోవడానికి పీవీ సింధు ఆడిన విన్నింగ్ షాట్‌ అద్భుతంగా ఉంటుంది. మియా బ్లిచ్‌‌ఫెల్డ్‌ సర్వ్ చేసిన షాట్ అది. తొలుత నెట్స్‌కు దగ్గరగా మియా సర్వ్ చేయగా.. దాన్ని అలవోకగా ఫుల్ వ్యాలీగా దాన్ని తిప్పి పంపిస్తారు. ఆ షాట్‌ను మియా బ్లిచ్‌ఫెల్డ్ డీప్ కోర్ట్‌లోకి షాట్‌ ఆడగా..సింధు దాన్ని అడ్డుకుంటారు. తన ప్రత్యర్థికి ఎడమ వైపు కోర్ట్ డెడ్‌లైన్‌ అంచులకు షటిల్‌ను బుల్లెట్ వేగంతో రిటర్న్ ఆడతారు. ఆ షాట్‌ను అందుకునే ప్రయత్నం కూడా చేయదు మియా. ఆ షటిల్ ఇన్నర్ కోర్టులో పడటంతో ఒక్కసారిగా ఎగిరి గంతేస్తుంది సింధు. ఈ విజయంతో ఆమె క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టింది.

Story first published: Thursday, July 29, 2021, 11:24 [IST]
Other articles published on Jul 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X