రోడ్డునపడ్డ ఒలింపిక్స్‌ విజేత.. బతుకుదెరువు కోసం డెలివరీ బాయ్‌గా.. రోజుకు 50 కిలోమీటర్లు!!

హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచమే వణికిపోతోంది. కోట్ల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. వారిలో కోటికిపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడినవారే కాదు.. మిగతావారిలో అత్యధిక శాతం ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. వారిలో క్రీడాకారులు కూడా ఉన్నారు. ఫెన్సింగ్‌లో ఒలింపిక్‌ గోల్డ్‌ మెడల్‌ విజేత రూబెన్‌ లిమార్డో కూడా బతుకుదెరువు కోసం రోడ్డునపడ్డాడు. లిమార్డో ప్రస్తుతం ఆన్‌లైన్‌ ఆహార సరఫరా సంస్థ ఉబెర్‌ ఈట్స్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు.

35 ఏళ్ల రూబెన్‌ లిమార్డో 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలిచాడు. 1904 తర్వాత లాటిన్‌ అమెరికా నుంచి ఒలింపిక్‌ పతకం గెల్చిన తొలి వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కాడు. వెనెజులాకు ఒలింపిక్‌ స్వర్ణం ఆర్జించిన రెండో క్రీడాకారుడు కూడా. అంతేకాకుండా 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ఆయన తన దేశం తరపున పాల్గొంటున్నాడు. అయితే కరోనా కారణంగా కుటుంబ పోషణ కోసం గత వారం నుంచి కొత్త ఉద్యోగం చేస్తున్నట్లు లిమార్డో ట్విట్టర్ వేదికగా తెలిపాడు. తెలుసుకున్న ఆయన అభిమానులు షాక్‌కు గురయ్యారు.

రూబెన్‌ లిమార్డో.. ఆన్‌లైన్‌ ఆహార సరఫరా సంస్థ ఉబెర్‌ ఈట్స్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతను మాత్రమే కాదు వెనెజులాకు చెందిన ఫెన్సింగ్ బృందంలోని 20 మంది ఇతర సభ్యులు పోలాండ్‌లోని లాడ్జ్ పట్టణంలో డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్నారట. వైరస్ కారణంగా తమకు అందే ప్రోత్సాహకాల్లో కోత పడిందని, అందుకే అందరం ఈ దారి పట్టామని రూబెన్‌ లిమార్డో తెలిపాడు. పరిస్థితులకు అనుగుణంగా ఎవరిదారి వారే చూసుకోవాలని, మిగతావాటి మాదిరిగానే ఇదికూడా ఓ వృత్తి అని పేర్కొన్నాడు.

'కొత్త వృత్తిలో రోజుకు 50 కిలోమీటర్లు తిరగాల్సి వస్తోంది. ప్రతిఫలంగా నాకు వారానికి 100 యూరోలు (సుమారు రూ.9 వేలు) వస్తాయి. ఉబెర్‌ ఈట్స్‌లో ఉద్యోగంలో చేరే ముందు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. అయితే ఈ ఉద్యోగం చేస్తున్నా.. నా భవిష్యత్తుపై ఆశల్ని మాత్రం కోల్పోలేదు. నా అభ్యాసాన్ని మానలేదు. డెలివరీ అందచేసే ప్రతిసారీ.. అది నన్ను టోక్యో ఒలింపిక్స్‌ పతకానికి చేరువ చేస్తుంది' అని రూబెన్‌ లిమార్డో చెప్పాడు.

నెదర్లాండ్స్‌కు చెందిన పాల్‌ వాన్‌ మీకెరెన్‌ క్రికెటర్ కూడా ఉబెర్‌ ఈట్స్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కరోనా ధాటికి టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడడంతో అతడు రోడ్డునపడ్డాడు. దేశం తరఫున ప్రపంచకప్‌ జట్టులో ఆడాల్సిన పాల్ ఇప్పుడు కడుపు నింపుకోవడం కోసం నానా కష్టాలు పడుతున్నాడు. కరోనా తన జీవితాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో వెల్లడిస్తూ ఇటీవల పాల్ ఓ భావోద్వేగ ట్వీట్ చేశాడు. ప్రపంచకప్‌నకు ఆడాల్సిన తాను ఇప్పుడు పూట గడవక ఇబ్బంది పడుతున్నానంటూ అందులో పేర్కొన్నాడు. ప్రతి రోజూ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ వచ్చిన డబ్బుతో బతుకు ఈడుస్తున్నానని చెప్పుకొచ్చాడు.

ఐదు మ్యాచ్‌లు ఒకే వికెట్.. 14 మ్యాచ్‌ల్లో 169 రన్స్!! కోల్‌కతా వదులుకునేది ఈ ఆటగాళ్లనే!

  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS
  For Daily Alerts
  Read more about: ruben limardo
  Story first published: Monday, November 16, 2020, 20:31 [IST]
  Other articles published on Nov 16, 2020
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X